BigTV English

Rahul Gandhi : రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ క్యాన్సిల్.. సెక్యూరిటీ ప్రాబ్లమ్..

Rahul Gandhi : రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ క్యాన్సిల్.. సెక్యూరిటీ ప్రాబ్లమ్..

Rahul Gandhi : రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ రద్దు కావడం సంచలనంగా మారింది. పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినా.. పెద్దషాపూర్ లో జరగాల్సిన కార్నర్ మీటింగ్ అర్థాంతరంగా క్యాన్సిల్ కావడం కలకలం రేపుతోంది. మీటింగ్ రద్దు కావడానికి కారణం మరింత షాకింగ్ కు గురిచేస్తోంది.


భద్రతా కారణాలతో రాహుల్ మీటింగ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేంటి.. ఎస్పీజీ రక్షణలో ఉండే రాహుల్ కు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఏంటి? అని ఆరా తీస్తున్నారు. సోమవారం భారత్ జోడో యాత్రలో జరిగిన ఓ సంఘటనే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ రద్దు కావడానికి రీజన్ అని చెబుతున్నారు.

రాహుల్ పాదయాత్రలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా సెక్యూరిటీని చేధించుకుని వచ్చాడు. రాహుల్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. రాహుల్ ను కదలనీయకుండా.. కాళ్లను వదలకుండా అలానే పట్టుకోవడంతో అంతా అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ వారు వెంటనే అలర్ట్ అయి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


ఊహించని ఈ పరిణామం.. రాహుల్ గాంధీ భద్రతను ప్రశ్నార్థకంలో పడేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ పోలీస్ పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. రాహుల్ వెంట వలయంలా రక్షణ కల్పిస్తున్నా.. ఓ అనామకుడు రాహుల్ గాంధీ వరకు ఎలా రాగలిగాడు? ఆయన కాళ్లు పట్టుకొని వదలకుండా కాసేపు ఆపేయడం మామూలు విషయమేమీ కాదు. సెక్యూరిటీ లోపాలకు ఇది నిదర్శనం అంటున్నారు. ఎందుకైనా మంచిదని పెద్దషాపూర్ లో జరగాల్సిన కార్నర్ మీటింగ్ ను రద్దు చేశారు. రాహుల్ భద్రత ఏర్పాట్లపై మరోసారి రివ్యూ చేయనున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×