BigTV English

Rahul In HYD : తెలంగాణ కుల సర్వే దేశానికి ఓ దిక్సూచీ.. రాహుల్ ఆసక్తికర కామెంట్లు..

Rahul In HYD : తెలంగాణ కుల సర్వే దేశానికి ఓ దిక్సూచీ.. రాహుల్ ఆసక్తికర కామెంట్లు..

Rahul In HYD : భారత్ లో కుల వివక్ష ఇప్పటికీ బలంగా ఉందని.. దళితులు, ఆదివాసీలు, మహిళలపై అసమాత్వం ఉన్న మాట వాస్తవం అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో కుల వివక్ష లేదని అబద్ధం చేపలేకపోతున్నాను అన్న రాహుల్ గాంధీ.. రాజకీయ నాయకుడిగా తాను ప్రజల సమస్యలను వాస్తవ దృష్టితో చూడలనుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణాలో చేపట్టనున్న కుల గణన కార్యక్రమంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్లు చేశారు.


దేశంలోని అన్ని వ్యవస్థల్లో కుల వివక్ష బలంగా ఉందన్న రాహుల్ గాంధీ.. రాజకీయ, న్యాయ వ్యవస్థలు అందుకు మినహాయింపు కాదంటూ సంచల వ్యాఖ్యాలు చేశారు. ప్రపంచ దేశాల్లోనూ ప్రజల మధ్య వివక్ష ఉందని.. కానీ భారత్ లో ఉన్నంత బలంగా కులాల మధ్య వివక్షలు తాను చూడలేదని అన్నారు. భారత్ లో మనం అభివృద్ధి, సంతోషం గురించి మాట్లాడుతున్నాం. కానీ.. వాటి కంటే ముందు కుల వివక్ష నశిస్తేనే అవి అందరికీ చేరువవుతాయని అన్నారు.

తాను పాదయాత్ర చేసిన సమయంలో దేశమంతా తిరినప్పుడు.. ప్రజల్లో ఉన్న వివక్ష తనను ఆలోచనల్లో పడేసిందని రాహుల్, దానిని తాను తట్టుకోలేకపోయానని అన్నారు.
ఓ రాజకీయ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాన్న రాహుల్.. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలకు దేశంలో సరైన గౌరవం ఉందని చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలున్నాయని అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అని వ్యాఖ్యానించారు.


కులగణన గురించి అనేక విషయాలు పంచుకున్న రాహుల్ గాంధీ.. దేశానికి తెలంగాణా కులగణన రోల్ మోడల్ అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే.. ఇందులో కొన్ని పొరబాట్లకు అవకాశముందన్న రాహుల్.. వాటిని నిత్యం సమీక్షించుకుంటూ ముందుకు వెళతామని ప్రకటించారు. అందుకే.. ఎక్కడో కార్యాలయాల్లో కూర్చున్న అధికారులు, బ్యూరోక్రాట్లు కులగణన ఎలా జరగాలో, ఎలాంటి ప్రశ్నలు అడగాలో నిర్ణయించడం సమంజసం కాదన్న రాహుల్ గాంధీ.. అలాంటి కులగణన అవసరం లేదని అన్నారు.
అలా చేస్తే తెలంగాణ ప్రజలను అవమానించినట్లు భావిస్తానని అన్నారు. అందుకే.. ఏ ప్రశ్నలు అడగాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

తెలంగాణాలో నిర్వహించనున్న కుల గణన ద్వారా.. అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచుతామని ప్రకటించారు. రాజకీయాల్లోనూ వాటి వాటాను నిర్ణయించేందుకు.. ఈ గణన ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణాలో జరుగుతుంది.. కుల గణన మాత్రమే కాదని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను నిర్దేశించే ప్రక్రియ అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రపంచంలోనే ప్రఖ్యాత వ్యక్తితో అసమానత్వం గురించి మాట్లాడానన్న రాహుల్ గాంధీ.. అతను అనేక అసమానతలపై తనకు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే వాటిలో.. అతిపెద్ద వివక్ష అయిన కులవ్యవస్థ గురించి లేదన్న రాహుల్.. ఆ కారణంగానే ఆ విశ్లేషణను తాను అసంపూర్ణమైందని చెప్పినట్లు వెల్లడించారు.

Also Read :

తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న కులగణన పౌర తెలంగాణ, ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలకు పునాదిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి అనుభవాలను, ప్రయోజనాలకు దేశ మంతా విస్తరిస్తామని ప్రకటించిన రాహుల్.. తెలంగాణాలోని ప్రక్రియ మొత్తం దేశానికి ప్రామాణికం కానుందని వ్యాఖ్యానించారు.

Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Big Stories

×