E-Paper
Advertisement

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణ అంతా భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఒకటే కుమ్ముడే

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణ అంతా భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఒకటే కుమ్ముడే
Advertisement

Weather News: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని కారణంగా రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మూడు రోజులు భారీ వర్షాలు-తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గడిచిన రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ముందని వెల్లడించింది. వర్షాలు కంటిన్యూ పడడంతో అన్నదాతలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం సూచనలతో సాగు పనులకు సిద్ధమవుతున్నారు. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో వర్షపాతం పడాల్సిన దాని కంటే తక్కువ నమోదు అయ్యింది. జూన్, జులై కలిపితే ఇప్పటివరకు 10 సెంటీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

Advertisement

ప్రాజెక్టులు జలకళ-సుమారం 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెల కొన్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వచ్చింది. శ్రీశైలం డ్యామ్‌కు కేవలం 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,070 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం సంగారెడ్డి- 7.2, కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపల్లి- 6.9, వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేట-6.4, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి-6.3, మెదక్‌ జిల్లా శంకరం పేట-6.2, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు-4.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

సోమవారం అత్యధికంగా –బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డిలో అత్యధికంగా 7.2 సెం.మీ., కామారెడ్డి జిల్లాలో 6.9 సెం.మీ., వికారాబాద్ జిల్లాలో 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌వాసులకు షాకింగ్.. నిషేధిత ఆస్తుల జాబితాలో అపార్టుమెంట్లు, అయితే ఏంటి?

ఏపీ మాటేంటి? వాయుగుండం కారణంగా ఏపీలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు,హోర్డింగ్స్ కింద ఉండొద్దని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు.

Related News

PM విశ్వకర్మ నుండి UPI వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనపై బీజేపీ మాస్టర్ ప్లాన్!

యువతీయువకుడి వీరంగం.. బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

Big Stories

Advertisement
×