Rain Alert Hyderbad : వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుక్రవారం కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. వాతావరణం చల్లబడడంత పాటు హైదరాబాద్ తో పాటుగా ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా.. ఈ పరిస్థితులు వచ్చే సోమవారం వరకు కొనసాగుతాయిని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
మార్చి 24, సోమవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచిస్తూ ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి వరకు హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నప్పటికీ.. గత కొన్ని రోజులుగా, వేడిగాలుల కారణంగా హైదరాబాద్‌లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా, శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయని IMD-హైదరాబాద్ తెలిపింది. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు మంచి ఉపశమనం కలిగించింది.
మరోవైపు, శుక్రవారం నుంచి సోమవారం వరకు కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాంలలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు (40-50 కి.మీ.), వడగళ్ల వానతో పాటు ఆరెంజ్ (హై) అలర్ట్ జారీ చేసింది.
Also Read : Liquor Seized in Hyderabad: హైదరాబాద్‌లో ఢిల్లీ లిక్కర్.. రూ.22లక్షల మద్యం స్వాధీనం
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ జిల్లాల్లోని పలు మండలాల్లో… శనివారం నుంచి సోమవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయాల్లో గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ కారణంగానే… ఈ జిలాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read : CM Revanth Reddy: తెలంగాణకు 42 పైసలేనా? రేవంత్ లాజిక్‌తో మోదీకి మైండ్ బ్లాక్!
కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జనగాం జిల్లాల్లతో పాటుగా.. హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలు, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాలు, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.