Liquor Seized in Hyderabad: బషీర్బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో.. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 నాటి ఫారిన్ లిక్కర్ బాటిల్‌లను.. హైదరాబాద్ ఎన్ఫోర్స్ బీ టీమ్ పట్టుకున్నారు. 22లక్షల విలువైన 233 మద్యం బాటిల్స్, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బషీర్‌బాగ్‌లోని టాటా వాటర్ ఏజెన్సీ గోదాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం దాడులు నిర్వహించింది. 174 లీటర్ల మద్యం, 24 రకాల 233 ఫారెన్ మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం విలువ తొమ్మిదిన్నర లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిల్లతో పాటు ఒక కారును రూ. 35 వేల నగదును రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు.
వైన్స్ టెండర్స్ దక్కకపోవడంతో గతంలో మద్యం వ్యాపారం చేసిన హరీష్ కుమార్.. ఈ దందా నిర్వహిస్తున్నారు. 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి.. బాటిల్‌పై రూ.15 వందల నుంచి 2000 రూపాయల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ ఏసియన్ ఫోర్స్ బి టీమ్ వాటర్ ప్లాంట్ గోదాంలో దాడి చేసి.. ఫారిన్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: పార్టీలు లేవమ్మా..! కళ్లు బైర్లు కమ్మే లెక్కలు బయటపెట్టిన ఈసీ
ఈ కేసులో దోమలగూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఈర్వాణి, సికింద్రాబాద్ కు చెందిన విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. ఢిల్లీ వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్‌పై కూడా కేసులు నమోదు చేశారు. ఎన్ డి పి ఎల్ మద్యం పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్ టీమ్ కి, చంద్రశేఖర్ గౌడ్ టీం సభ్యులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలహాసన్ రెడ్డి స్వయంగా పిలిచి అభినందించారు.