BigTV English

Rain Alert: ఇవాళ, రేపు తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..

Rain Alert: ఇవాళ, రేపు తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..

Monsoon Updates of Telangana: వాతావరణ కేంద్రం తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. అదేవిధంగా ఆ సమయంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం లేకపోలేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…


హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షానికి సంబంధించి పలు సూచనలు చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. వర్షాల నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు కూడా ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనున్నదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?


కాగా, పశ్చిమ – మధ్య బంగాళాఖాతం వద్ద, మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న రెండు ఆవర్తనాలు నేడు విలీనమై మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా మారనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందంటూ వివరించారు. దీని ప్రభావం కారణంగానే రానున్న 24 గంటల్లో పశ్చిమ – మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడనున్నదని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×