E-Paper
Advertisement

Bigg Boss Sonia : ఏంటి.. బిగ్ బాస్ సోనియాకు ఆల్రెడీ పెళ్లయిందా..? భర్త ఏం చేస్తాడంటే?

Bigg Boss Sonia : ఏంటి.. బిగ్ బాస్ సోనియాకు ఆల్రెడీ పెళ్లయిందా..? భర్త ఏం చేస్తాడంటే?
Advertisement

Bigg Boss Sonia : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది.రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో మూడో వారం కాస్త ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ పై సెటైర్స్ వెయ్యడం కారణంతోనే అభయ్ ఇంటి నుంచి బయటకు ఎలిమినేట్ అయ్యి వచ్చేశాడు. ఇక నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ఈరోజు మొదలు కానుంది. .14 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వడంతో 11 మంది సభ్యులే ఉన్నారు.. ఈ షోలో కాస్త నెగిటివిటి సంపాదించుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు.. ఈమె అందరి మీద అయిందానికి కానీ దానికి నోరు పారేసుకుంటూ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని నడిపేది.. అయితే ఈమె గురించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో తెలుసుకుందాం..

బిగ్ బాస్ హౌస్ లో నెగెటివిటీ తో పాటు కాస్త లవ్ స్టోరీ ని నడిపిస్తున్న ఆకుల సోనియా పైన అందరి దృష్టి ఉంది. ఓవైపు నిఖిల్ తో వ్యవహారం నడిపిస్తూనే మరోవైపు నాకు అన్న అవుతాడు పెద్దోడు చిన్నోడు అంటూ మాటలు మాట్లాడుతోంది. దీంతో సోనియా పై చాలా మంది ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈమె ఆటతో పాటు క్యారెక్టర్ మీద కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. కొంతమంది లేడీ కంటెస్టెంట్ల మీద ఈమె చేసే కామెంట్లు చాలామందికి నచ్చడం లేదు. దాంతో కొందరు ఆమె వల్ల హౌస్ మొత్తం చెడిపోతుందనే అభిప్రాయానికి వచ్చారు. తాజాగా సోనియా గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆమెకు ఆల్రెడీ పెళ్లయిందని టాక్ నడుస్తుంది.

Is Bigg Boss Sonia already married..? What does the husband do?
Is Bigg Boss Sonia already married..? What does the husband do?
Advertisement

నిజానికి ఆమెకు పెళ్లి అవ్వడం మాత్రమే కాదు విడాకులు కూడా అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం. సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈమె బీటెక్ చేయడానికి హైదరాబాద్ కి వచ్చిన సమయంలో మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలా సినిమాల్లోకి రావాలి అనుకొని ఎన్నో కలలు కన్నది.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సినిమాలు వద్దు మోడలింగ్ వద్దు అని ఓ అబ్బాయి తో పెళ్లి చేశారట. అయితే అతను సాఫ్ట్ వేర్ కావడంతో హైదరాబాద్ లో ఉంటున్నారు. అప్పుడు భర్తను ఒప్పించి యాంకరింగ్ లోకి అడుగు పెట్టింది. అలా యాంకర్ గా కొన్ని షోలు చేస్తున్న సమయంలో సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లోకి వెళ్దామని నిర్ణయం తీసుకుందట. కానీ సోనియా చేసే పనులు పెళ్లి చేసుకున్న భర్తకి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అలా రోజురోజుకు గొడవలు ఎక్కువవ్వడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారట.. ఆ తర్వాత సినిమాల్లో చేసింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో విడాకులు అయిన అబ్బాయిని ప్రేమిస్తుందని తానే చెప్పింది. బిగ్ బాస్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీని నడిపిస్తుంది..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×