BigTV English

Weather Report: మరో 4 రోజులు వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..

Weather Report: మరో 4 రోజులు వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..
rains

Weather Report in telugu states(Telugu news live today): తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు పూర్తిగా కమ్మేశాయి. లేట్‌గా అయినా లేటెస్ట్‌గా.. రెండు రోజులుగా మంచి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో వేళాపాళా లేకుండా ఆగిఆగి వాన కురుస్తోంది. గతంలో మాదిరి ఒకేసారి కుంభవృష్టి కాకుండా.. ఓ మోస్తారుగా వరుణుడు కరుణిస్తున్నాడు. హైదరాబాద్‌తో పాటే తెలంగాణ వ్యాప్తంగా వానలే వానలు. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.


అటు, ఏపీలోనూ వానలు ఊపందుకున్నాయి. మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని జిల్లాలకు వాన ముసురు పట్టుకుంది. కొన్ని ప్రాంతాల్లో పగలు మబ్బులు కమ్మేస్తాయని.. రాత్రికి వర్షం కురుస్తుందని వివరించారు. ఇక కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తెల్లవారు జాము నుండి భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి.ఎటు చూసినా వర్షపు నీరే దర్శనమిచ్చింది.


Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×