OTT Movie : ఈ సినిమాలో కుక్కల పంచాయితీ ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లైఫ్ లో సమస్యలు ఎదుర్కుంటున్న వ్యక్తికి కుక్కల అరుపులు సమస్యగా చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత స్టోరీ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది. ఈ స్టోరీ ఒక ఫీల్ గుడ్ మూమెంట్ తో ఎండ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కొరియన్ బ్లాక్ కామెడీ మూవీ పేరు “Barking Dogs Never Bite”. 2000లో విడుదలైన ఈ సినిమాకి బాంగ్ జూన్-హో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లీ సంగ్-జే (కో యూన్-జూ), బే డూనా (పార్క్ హ్యున్-నామ్), కిమ్ హో-జంగ్ (యూన్-సిల్), బ్యూన్ హీ-బాంగ్ (జనిటర్) ప్రధాన పాత్రలలో నటించారు. 1 గంట 50 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.9/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా బ్యూనస్ ఐర్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సౌండ్‌ట్రాక్ అవార్డ్, మ్యూనిఖ్ ఫిల్మ్ ఫెస్ట్‌లో బెస్ట్ న్యూకమర్ అవార్డ్‌ను గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
కో యూన్-జూ తనభార్య యూన్-సిల్ తో ఒక పెద్ద అపార్ట్‌మెంట్ లో జీవిస్తుంటాడు. యూన్-జూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పర్మినెంట్ ఉద్యోగం కోసం పోరాడుతుంటాడు. కానీ డీన్‌కు లంచం ఇవ్వడానికి, అతనికి డబ్బు సమస్యగా మారుతుంది. అతని భార్య యూన్-సిల్ ఇంటికి కావాల్సిన ఆదాయాన్ని సంపాదిస్తూ, భర్తని తక్కువగా చూస్తూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళ బంధంలో మనస్పర్థలు వస్తాయి. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌లో ఎక్కడో నుంచో వచ్చే కుక్కల అరుపులు, యూన్-జూను మరింత చిరాకు తెప్పిస్తాయ. ఒక రోజు అతను అక్కడే తిరుగుతున్న కుక్కను గమనిస్తాడు. దాన్ని కిడ్నాప్ చేసి బేస్‌మెంట్‌లోని క్యాబినెట్‌లో బంధిస్తాడు. దాన్ని చంపడానికి సిద్ధపడతాడు, కానీ ధైర్యం చేయలేక లాక్ చేసి వెళ్లిపోతాడు.
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో బుక్‌కీపర్ గా పనిచేసే పార్క్ హ్యున్-నామ్, టీవీలో ఫేమస్ అవ్వాలని కలలు కంటుంది. అదే సమయంలో, కనిపించకుండా పోయిన కుక్క కోసం, ఒక చిన్న అమ్మాయి ఫ్లయర్స్‌తో హ్యున్-నామ్ వద్దకు వస్తుంది. మరో వైపు యూన్-జూ తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. నిజానికి ఆ కుక్క మూగదని తరువాత తెలుస్తుంది. అతను ఆ కుక్కను బేస్‌మెంట్‌కు వెళ్ళి విడిపిస్తాడు. నిజమైన బార్కింగ్ కుక్క, ఒక వృద్ధ మహిళ కు చెందినదని తెలుసుకున్న యూన్-జూ, ఆ కుక్కను కిడ్నాప్ చేసి, హ్యున్-నామ్ చూస్తుండగా, దాన్ని రూఫ్ నుండి విసిరేస్తాడు. హ్యున్-నామ్ ఫేమ్ కోసం అతన్ని వెంబడిస్తుంది, కానీ ఒక తలుపు తగిలి స్పృహ కోల్పోతుంది. యూన్-జూ అక్కడి నుంచి తప్పించుకుంటాడు.
ఈ సంఘటనల తర్వాత యూన్-సిల్ ఒక చిన్న కుక్కను కొనుగోలు చేస్తుంది. దానిపై యూన్-జూ కంటే ఎక్కువ ఆప్యాయత చూపిస్తుంది. ఒక రోజు యూన్-జూ, పార్క్‌లో ఆ కుక్క పిల్లను మిస్ చేసుకుంటాడు . దీనిపై యూన్-సిల్ అతన్ని తీవ్రంగా మందలిస్తుంది. ఆమె తన సెవరెన్స్ పేలో కొంత భాగాన్ని కుక్క కోసం, మిగిలినది యూన్-జూ ప్రొఫెసర్‌షిప్ కోసం లంచం ఇవ్వడానికి ఉపయోగించాలని ప్లాన్ చేసిందని తెలుస్తుంది. యూన్-జూకి ఈ విషయం తెలిసి చాలా బాధపడతాడు. చివరికి యూన్-జూకి ఈ కుక్కల సమస్య తీరుతుందా ? అతని ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా ? కుక్కల వల్ల ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఆ బంగళాలోకి వెళ్తే బయటకు రావడం కష్టం… ఈ హర్రర్ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్