Indigo Flight: నిన్న బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్‌లో పైలట్లు మే కాల్ ఇచ్చారు. గువాహటి నుంచి చెన్నై వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బందికి మేడే కాల్ ఇచ్చారు. దీంతో ఫ్లైట్ ల్యాండింగ్‌కు వెంటనే ఏర్పాట్లు చేశారు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో 168 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎదైనా ఆకస్మాత్తుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అత్యవసర ల్యాండింగ్ కోసం మేడే కాల్ చేస్తారు.
విమాన ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులకు వణుకు పుడుతోంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత పూటకో చోట విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వినాల్సివస్తోంది. ఈ క్రమంలో గువాహటి నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా బెంగళూరులో ల్యాండ్ అయ్యింది. పైలట్ మేడే… మేడే… అని సందేశం ఇచ్చిన కొద్దిసేపటికే…. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో తగినంత ఇంధనం లేకపోవడంతో మేడే కాల్ ఇచ్చారు పైలట్లు. దీంతో కాసేపు నరాలు తెగె ఉత్కంఠ నెలకొంది. చివరికి విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.
ALSO READ: BEL: డిగ్రీ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. రూ.60వేల జీతం, డోంట్ మిస్
అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమాన పైలెట్ కూడా మేడే మేడే అని సందేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సెకన్లకే విమానం కూలిపోయింది. ఇప్పుడు ఇండిగో పైలెట్ కూడా మేడే.. మేడే.. అని సంకేతాలు ఇవ్వడంతో.. ఏం జరుగుతుందో ఏమోనని అంతా భయపడిపోయారు. చివరికి విమానం సేఫ్‌గా ల్యాండవడంతో… అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో మొత్తం 168 మంది ప్రయాణికులు ఉన్నారు.
ALSO READ: Viral Video : అంతా డ్రామా.. విమానంలో 11A సీటు కోసం గొడవ.. ఆ వీడియో ఫేక్
ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది స్పాట్‌లో చనిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.