BigTV English

Hyderabad: వాన..వరద.. హైదరాబాద్‌ హైరానా..

Hyderabad: వాన..వరద.. హైదరాబాద్‌ హైరానా..
Hyderabad news today

Hyderabad news today(Local news telangana): భాగ్యన‌గ‌రంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వానలకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్నారు. పలు ప్రాంతాల్లో నిలిచి పోయిన విద్యుత్ సరఫరాతో ప్రజలు ఇక్కట్లు వర్ణనాతీతం.


నాన్‌స్టాప్ వానకు నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. ఆఫీసులకు వెళ్లేవారు, చిరువ్యాపారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాలతో GHMC అలర్ట్ అయింది. శిథిలావస్థ భవనాల్లో ఉంటున్న వారిని యుద్ధప్రతిపాదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో DRF టీమ్ లను GHMC ఏర్పాటు చేసింది. వాటర్ లాగింగ్ 24 గంటలు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని అధికారుల సూచించారు. వర్షాలతో తలెత్తే సమస్యలపై నగరవాసులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 300లకు పైగా కంప్లైంట్స్ వచ్చాయి.


హైదర్ నగర్‌లో అత్యధికంగా 7.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, మియాపూర్‌లో 7.2, బాలాజీ నగర్‌లో 6.4, ఆనంద్ బాగ్‌లో 6.33, గాజుల రామరంలో 6.2 సెంటీమీటర్ల వాన పడింది. జీడిమెట్ల 6.1 , కాప్రా 5.7, వేస్ట్ మారెడ్ పల్లి 5.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత రెండు రోజులు నుంచి 3, 4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదవగా.. గురువారం 9 గంటలలోనే 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×