E-Paper
Advertisement

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు
Advertisement

Hyderabad City: దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ వెల్లడించింది. అంతేకాదు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. సాయంత్రం నుంచి రాత్రి వరకు

Advertisement

దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పటివరకు 22 రాష్ట్రాలకు వ్యాపించాయి. ఈ విషయాన్ని భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ లేదా రేపు ఉత్తరప్రదేశ్‌లోని రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. గతేడాది కంటే వారం రోజులు ఆలస్యంగా రుతుపవనాలు అక్కడ ప్రవేశించనున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.

16 రోజులుగా రుతుపవనాలు బీహార్ పరిసర ప్రాంతాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల జోరుతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, అటు ఏపీలో కూడా

ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

తీవ్రమైన వేడి కారణంగా హైదరాబాద్‌ సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొద్దిసేపటి కిందట అమీన్ పూర్ ప్రాంతంలో భారీ వర్షం పడింది. వర్షానికి తోడు ఈదురు గాలులు తోడయ్యాయి. వాయువ్య హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, మియాపూర్, ఆర్సీ పురం, శంషాబాద్, మొయినాబాద్, నిజాంపేట్ వంటి పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ALSO READ: లైక్‌ల కోసం ఆశపడి.. డ్యామేజ్ చేస్తున్న స్టూడెంట్స్, ఏకంగా 456 మంది ఏం చేశారంటే.. 

సాయంత్రం, రాత్రి సమయాల్లో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలియజేసింది. వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రెడీ చేసుకోవాలని కోరింది. అటు ఏపీలోనూ వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

 

 

 

Related News

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు.. రెడ్ హిల్స్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×