E-Paper
Advertisement

Kissik Talks: ఇండస్ట్రీ అమ్మాయిలకి పనికి రాదా? మేల్, ఫీమేల్ అవకాశాలపై రేఖ ఊహించని కామెంట్!

Kissik Talks: ఇండస్ట్రీ అమ్మాయిలకి పనికి రాదా? మేల్, ఫీమేల్ అవకాశాలపై రేఖ ఊహించని కామెంట్!
Advertisement

Kissik Talks: ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ అంటూ పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది రేఖ వేదవ్యాస్.. అద్భుతమైన నటనతో, అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలోనే కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడం.. దీనికి తోడు ఇతర సినిమా షెడ్యూల్ వల్ల బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకోవడం వంటి కారణాలవల్ల సక్సెస్ రాక చివరికి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయింది. మధ్యలో రెండేళ్ల క్రితం ఒక టీవీ షోలో కనిపించి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అని చెప్పి ఆశ్చర్యపరిచిన ఈమె ఇప్పుడు మళ్లీ ఆరోగ్యంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.

ఇండస్ట్రీలో మహిళలకు అప్పుడే స్వేచ్ఛ..

తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన ఈమె.. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లకు, మగవాళ్లకు లభించే సినిమా అవకాశాలపై ఊహించని కామెంట్లు చేసింది. ముఖ్యంగా మనం మేల్ డామినేషన్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం అంటూ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. అవకాశాలు రావడం పై రేఖ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అంటే చిన్న ఏజ్ వాళ్లని తీసుకుంటారు. అలాగే సీనియర్స్ ని తీసుకుంటారు. ఇక నేను చాలా చిన్నదాన్ని కాదు.. అలాగని చాలా ఏజ్ పర్సన్ ని కాదు.. అమ్మ పాత్రలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం అలాంటి పాత్రలకు ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ లైన్లో ఉన్నారు. నన్ను ఎక్కడ ఫిట్ చేస్తారు. వాళ్లు ఫిట్ చేసినప్పుడు నాకు కూడా ఆ పాత్ర నచ్చాలి. ఏదో వెనకాల నిల్చోమని, ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆ సినిమాలో రేఖ ఉందంటే ఉంది అని చెప్పే పాత్రలు నాకు వద్దు.

Advertisement

also read:Bhagya Raj: మరణంలో కూడా ఆగని సాయం.. భాగ్యరాజ్ గొప్ప మనసుకు సినీలోకం ఫిదా!

మేల్ డామినేషన్ ఎక్కువ..

చేయడానికి ఏమీ లేనప్పుడు అలాంటి పాత్రలు చేసి ఏం లాభం. ముఖ్యంగా ఈ ఏజ్ అనేది ఎప్పుడు బెటర్ అవుతుందో.. అప్పుడు మన మహిళలందరికీ మేలు జరుగుతుంది. ముఖ్యంగా నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు. మన ప్రపంచమే మేల్ డామినేషన్ తో నడుస్తోంది. పురుష ఆధిక్య ప్రపంచంలోనే మనం బ్రతుకుతున్నాము.. ఒక హీరోకి ఎంత ఏజ్ అయినా సరే ప్రాబ్లం లేదు. సూపర్ గా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటారు. కానీ ఒక అమ్మాయికి ఏజ్ అయిపోయిందంటే ఆంటీ, అమ్మ, పచ్చిగా చెప్పాలి అంటే ముసల్ది అని అంటారు. నా గురించే కాదు నా ముందు వేరే వాళ్ల గురించి మాట్లాడటం కూడా నేను విన్నాను.. అందుకే నాకంటూ ఒక మంచి పాత్ర వచ్చి ఆ పాత్ర నా కెరియర్ కు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ అవకాశాన్ని నేను అందుకుంటాను. ఏజ్ చూసి కాదు.. నటన కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు ఇవ్వాలి” అంటూ రేఖ తెలిపింది.

Advertisement

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×