Sanjay Manjrekar On Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 tournament ) అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (VAIBHAV SURYAVANSHI) అతి త్వరలోనే టీమ్ ఇండియా జట్టులో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే ఐర్లాండ్, ఇంగ్లాండ్ అలాగే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ కోసం వైభవ్ పేరు ఖరారైంది. ఇవాళ ఐర్లాండ్ తో జరిగే రెండో టి20 నేపథ్యంలో వైభవ్ సూర్యవంశం అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. అభిషేక్ శర్మతో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతాడని చెబుతున్నారు. ఇదే జరిగితే వికెట్ కీపర్ గా పనిచేస్తున్న సంజు శాంసన్ పక్కకు జరగాల్సిన పరిస్థితి నెలకొంటుందని చర్చ జరుగుతోంది.
అయితే దీనిపై సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ ( Sanju Samson) మెడ పై కత్తి వేలాడుతోందని వ్యాఖ్యానించారు. వైభవ్ కాస్త టచ్ లోకి వస్తే సంజు శాంసన్ అడ్రస్ గల్లంతు కావడం గ్యారెంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు సంజయ్ మంజ్రేకర్. టీమిండియాలోకి వచ్చి అద్భుతంగా వైభవ్ సూర్యవంశీ రాణిస్తే మాత్రం, టి20 జట్టులో సంజు శాంసన్ కెరీర్ కనుమరుగవుతుందని వార్నింగ్ ఇచ్చారు. అందుకే వైభవ్ సూర్య వంశీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు సంజయ్ మంజ్రేకర్.
టీమిండియాలోకి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ వస్తున్న నేపథ్యంలో సంజు శాంసన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సంజయ్ మంజ్రేకర్. వైభవ్ టీమిండియాలోకి వస్తే సంజు శాంసన్ స్థానం గల్లంతు అయ్యే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. వైభవ్ తుది జట్టులోకి వచ్చి బాగా రానిస్తే… సంజు కు తుదిదట్టులో ఛాన్స్ అస్సలు రాదని హెచ్చరించారు. ఇప్పటికే సంజు శాంసన్.. అడపాదడపా చాన్సులను దక్కించుకుంటున్నాడని వెల్లడించారు. ఇక వైభవ్ వచ్చి సెటిల్ అయితే.. సంజు స్థానం గల్లంతయి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైభవ్ కారణంగా అభిషేక్ శర్మ కంటే, సంజు శాంసన్ కు పెను ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా సెటిల్ కావడం గ్యారెంటీ అని తెలిపారు.
టి20 జట్టులో వైభవ్ కంటే సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చేందుకు గౌతమ్ గంభీర్ కుట్రలకు తెరలేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే మొన్న మొదటి మ్యాచ్ లోనే వైభవ్ పై వేటు వేశాడట ఆ గంభీర్. వాషింగ్టన్ సుందర్ ను పక్కకు పెట్టైనా వైభవ్ ను తీసుకోవాలని శ్రేయస్ సూచనలు ఇస్తే.. గంభీర్ ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. కానీ, బీసీసీఐ, సోషల్ మీడియా నుంచి వైభవ్ కు ఎక్కువగా సపోర్ట్ దక్కుతోంది. ఇలాంటి నేపథ్యంలో గంభీర్ పాచికలు పనిచేయవని కూడా క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.