Big Stories

Rains : తెలుగు రాష్ట్రాలను వీడని వర్షాలు..మరో 3 రోజులు వానలే వానలు

Rains : తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు
శీతాకాలం వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంలేదు. జూన్ లో మొదలైన వానలు 5 నెలలుగా దంచి కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వానలు పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో తూర్పు దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. కొన్నిరోజులపాటు పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

Rains : ఏపీలో వానలే వానలు
వచ్చే రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఈశాన్య రుతు పవనాల ప్రభావం ఉంది. దీంతో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పార్వతీపురం మన్యం, అంబేద్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. మంగళవారం అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 13 సెం.మీ, అనంతపురం జిల్లా కనేకల్‌లో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

Latest News