Raja Singh: బీజేపీ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. కట్టర్ కాషాయ కార్యకర్త.. అంతకుమించిన హిందుత్వ వాది.. అయినా సరే.. రాజాసింగ్‌ని బీజేపీ వదిలేసుకుంది. ఆయన రాజీనామా గురించి ఎక్కువ ఆలోచించకుండా.. ఆమోదించేసింది. సింపుల్‌గా చెప్పాలంటే.. రాజాసింగ్‌ని అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు బీజేపీ అధిష్టానం. పార్టీ నుంచి వెళ్లిపోతారా.. అయితే ఓకే.. అన్నట్లుగా వ్యవహరించింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికని వ్యతిరేకిస్తూ.. రాజాసింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆమోదించారు.
రాజాసింగ్ ఎపిసోడ్‌తో ఒక్క విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైపోయింది. పార్టీని ధిక్కరిస్తే.. ఎంతటి నాయకుడినైనా వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందనే మెసేజ్ పంపింది.. ఢిల్లీ హైకమాండ్. ఇందుకు.. రాజాసింగ్ రాజీనామాని వెంటనే ఆమోదించడమే బిగ్ సిగ్నల్. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని.. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తే.. ఎంతటి నాయకులైనా సహించబోమని అధిష్టానం స్పష్టం చేసింది. రాజాసింగ్ తీరు.. బీజేపీ సిద్ధాంతాలు, పార్టీ పనితీరుకు విరుద్ధంగా ఉన్నాయని.. హైకమాండ్ చెప్పడం చూస్తుంటే.. పార్టీ లైన్ క్రాస్ చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సందేశం పంపారు. పార్టీ నుంచి బయటకు పంపేందుకు.. అస్సలు వెనుకాడబోమని.. అధిష్టానం కరాఖండిగా చెప్పేసింది. ఇది.. మిగతా నాయకులకు కూడా ఓ హెచ్చరికలా పనిచేస్తుందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకంపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేయడం, స్వయంగా ఆయనే పోటీ చేసేందుకు ప్రయత్నించడం లాంటివి.. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అనవసర జోక్యంగా, అధిష్టానం నిర్ణయాలను ప్రశఅనించే చర్యగా.. హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు.. రాజాసింగ్ రాజీనామాని ఆమోదించడంతో.. ఇలాంటి జోక్యాన్ని సహించబోమని పార్టీ తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. రాజాసింగ్ లాంటి నాయకుడినే వదులుకునేందుకు సిద్ధమయ్యారంటే.. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణే అంతిమం అనే బలమైన సందేశాన్నిచ్చింది. పార్టీనే అల్టిమేట్.. అనే విషయం.. మిగతా నాయకులకు కూడా అర్థమయ్యేలా చేసింది అధినాయకత్వం.
Also Read: రాజాసింగ్‌కు బీజేపీ బిగ్ షాక్.. ఎవరికి లాస్?
ఇక.. రాజీనామా ఆమోదంపై.. రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. హిందుత్వం కోసం.. తన చివరి శ్వాస దాకా పనిచేస్తానని చెప్పారు. తనను నమ్మి.. 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీకి.. కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తున్న లక్షలాది.. పార్టీ కార్యకర్తల బాధను తాను అధిష్టానానికి తెలియజేయకపోవచ్చన్నారు. ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లబ్ధి కోసమో.. తాను రాజీనామా చేయలేదన్నారు. బీజేపీ అధిష్టానం రాజీనామాని ఆమోదించడంతో.. రాజాసింగ్.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? లేక.. అలాగే కొనసాగుతారా? అన్నది కూడా ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఆయన అడుగులు ఎలా ఉంటాయన్నది కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.