BigTV English
Advertisement

Kaliyugam 2064: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కలియుగం 2064.. దేనిలో చూడొచ్చు అంటే ?

Kaliyugam 2064: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కలియుగం 2064.. దేనిలో చూడొచ్చు అంటే ?

Kaliyugam 2064: 2064లో కలియుగంలో ఏం జరగబోతోంది? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అనే వ్యూహాత్మక సన్నివేశాలతో తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం 2064’. ఈ మధ్యకాలంలో భవిష్యత్తును ఆధారం చేసుకొని సైన్స్ ఫిక్షన్ మూవీగా చాలా సినిమాలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి వాటిలో కలియుగం 2064 కూడా ఒకటి. శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), కిషోర్ (Kishore) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కలియుగం 2064.


కల్కి 2898AD తరహాలో కలియుగం 2064..

ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో మే 9 వ తేదీన విడుదలైంది. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె ఎస్ రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను 2024 నవంబర్ 15న ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam ) విడుదల చేయగా.. ఏప్రిల్ 25న ఈ ఏడాది ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చిన కల్కి 2898AD ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే తరహాలో కలియుగం 2064 మూవీ ని రూపొందించారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.


సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కలియుగం 2064..

అలాంటి ఈ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 2064 సంవత్సరంలో ఈ మానవాళికి ఏమవుతుంది? ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాలను ఆధారంగా చేసుకుని వ్యూహాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తానికి అయితే ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

కలియుగం 2064 రివ్యూ:

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ప్రపంచ యుద్ధం తర్వాత సంపన్న వర్గం రెసిడెంట్స్ అనే ప్రాంతాన్ని నిర్మించుకుంటారు. ఆకలికి అలమటించే పేదవాళ్లంతా లిబరేటర్ లుగా ఒక రకమైన బానిసలుగా బ్రతుకుతుంటారు. ఈ పరిస్థితుల్లో లిబరేటర్స్ కి చెందిన భూమి (శ్రద్ధ శ్రీనాథ్), మరో వ్యక్తి (కిషోర్ ).. రెసిడెంట్ వర్గానికి చెందిన థామస్ (ఇనియన్ సుబ్రమణి) చేతిలో బందీలుగా మారిపోతారు. ఇక రెసిడెన్స్ అనే వర్గాన్ని ఎందుకు క్రియేట్ చేశార అలాగే లిబరేటర్స్ ఎందుకు బందీలుగా మారిపోయారు? భూమిని థామస్ ఎందుకు బంధించించారు? అసలు పేదవాళ్ళను బంధీగా చేసిన థామస్ టార్గెట్ ఏమిటి? రంగంలోకి మధ్యలో దిగిన రితి ఎవరు? 2064 సంవత్సరంలో జరిగే సంఘటనలకు, కల్కి కి ఉన్న సంబంధం ఏమిటి? లిబరేటర్స్ కి భూమి ఎలాంటి స్వేచ్ఛను కల్పించింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

పాత్రలను అర్థవంతంగా చూపించడంలో డైరెక్టర్ విఫలం అయ్యారా?

ముఖ్యంగా ఏ సినిమాలోనూ టచ్ చేయని పాయింట్ ను తీసుకొని, ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశారు. కానీ కథ, కథనం, పాత్రల డిజైనింగ్ ఇంకా అర్థవంతంగా చేసి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజలను బానిసలుగా చేసుకోవాలనుకునే పాయింట్ మీద ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా యుద్ధాల తర్వాత సాధారణ ప్రజలకు సంబంధించిన ఆహార భద్రతపై ఆలోచింపచేసే విధంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది.

ALSO READ:Betting App Case : హీరోలకు మళ్లీ నోటీసులు… ఇప్పుడు అంతా కక్కేస్తారు?

Related News

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Big Stories

×