Rangareddy district: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్దలో కారులో ఆడుకుంటుండగా.. కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో దామరగిద్ద గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పోలీసులు వివరాల ప్రకారం.. రంగారెెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన తన్మయ శ్రీ(5), అభినయ శ్రీ (4) ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఈ రోజు ఇంటి ముందు ఉన్న కారులో ఆడుకుంటుండగా.. ఆకస్మాత్తుగా డోర్లు లాక్ అయిపోయాయి. ఇద్దరు చిన్నారులు కారులో ఇరుక్కుపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించలేదు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కారులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు శ్రమించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
కాగా, తమ ఇద్దరు చిన్నారులు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు. ఇంతలోనే కారు డోర్లు ఓపెన్ చేయగా.. అప్పటికే ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. కారులో మృతిచెంది ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి పేరెంట్స్ తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి..? ఎవరైనా కావాలనే చేశారా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: CBHFL Recruitment: ఒక్క ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. ఇంటర్, డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలివే..
ఇది కూడా చదవండి: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. రూ.లక్షల్లో శాలరీ.. రేపే లాస్ట్ డేట్..