Sachin Tendulkar: ఇంటర్నేషనల్ మాస్టర్ టి-20 లీగ్ లో భాగంగా బుధవారం వడోదర వేదికగా ఆస్ట్రేలియా – భారత్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 95 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమిపాలైంది. కానీ ఈ మ్యాచ్ లో 52 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ కి వారెవా అనాల్సిందే. తనకి ఏజ్ కేవలం నంబర్ మాత్రమే అని చాటుతూ.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ టెండూల్కర్ రెచ్చిపోయాడు.
Also Read: Saud Shakeel: మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు.. పాకిస్థాన్ ప్లేయర్లకే ఇది సాధ్యం…!
ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ విధ్వంసం సృష్టించాడు. తన స్టైల్ లో స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఆడుతూ అభిమానులకు కిక్కిచ్చాడు. కేవలం 33 బంతులలోనే 64 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. సచిన్ స్ట్రైక్ రేట్ 193.94 కావడం విశేషం. సిక్స్ గేర్ వేసి తగ్గేదేలే అంటూ పరుగులు తీశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.
ఈ మ్యాచ్ లో సచిన్ అద్భుతంగా రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో షాన్ మార్ష్ {22} పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అలాగే వికెట్ కీపర్ బెన్ డంక్ 53 బంతులలో 132 పరుగులతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇందులో 12 ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగాడు. దీంతో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ {64}, నమన్ ఓజ {19}, ఇర్ఫాన్ పఠాన్ 11, యూసఫ్ పటాన్ {25}, పవన్ నేగి 14, రాహుల్ శర్మ 18 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
Also Read: Steve Smith Retires: ఆస్ట్రేలియాలో కుదుపు… స్టీవెన్ స్మిత్ రిటైర్మెంట్
దీంతో ఆస్ట్రేలియా సంధించిన 269 పరుగుల భారీ చేదనలో భారత్ వెనుకబడింది. 174 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ 8న రాయిపూర్ వేదికగా వెస్టిండీస్ తో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ఒకప్పటిలా బ్యాటింగ్ తో అలరించడంతో సచిన్ నామ జపంతో స్టేడియం మార్మోగింది. సచిన్ బ్యాటింగ్ చూస్తూ అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేశారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం..
51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపిస్తున్న లిటిల్ మాస్టర్ బ్యాటింగ్
ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ
కేవలం 33 బంతుల్లో 64 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్
Video Credits: International Masters League pic.twitter.com/vJlz17xEZ0
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2025