BigTV English

ITIR Project Cancellation : ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు.. కేంద్రం బయటపెట్టిన సంచలన నిజాలు..

ITIR Project Cancellation : ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు.. కేంద్రం బయటపెట్టిన సంచలన నిజాలు..

ITIR Project Cancellation : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ తెలంగాణకు రాకుండా రద్దవ్వడానికి కారణం బీఆర్ఎస్‌ సర్కార్ నిర్లక్ష్యమే అని తేలింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ దాఖలు చేసిన అప్లికేషన్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.


అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని.. నివేదికలు పంపలేదని.. అందుకే ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్టు సంచలన విషయాన్ని తెలిపింది. దీంతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరు కారణంగా రాష్ట్రం మరో విలువైన ప్రాజెక్ట్‌ను కోల్పోయినట్టైందన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో 2016, 2017లో రెండుసార్లు రాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరిపామని కేంద్రం తెలిపింది. ఈ సమావేశాల్లోనే నివేదికలు కోరామంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది.

ఈ ప్రాజెక్ట్‌ రద్దు వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల అభివృద్ధికి ఫుల్ స్టాప్‌ పడినట్టైంది. అనేక రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు.. ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్ పార్క్‌ల ఏర్పాటుకు రాష్ట్రం అవకాశం కోల్పోయినట్టైంది.


ఈ ప్రాజెక్ట్ రద్దు వెనుక మోడీ సర్కార్ కుట్ర ఉందంటూ అప్పట్లో ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోడీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. అయితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

.

.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×