BigTV English

KCR: తలపై టోపీ.. కేసీఆర్ కొత్త సెంటిమెంట్ అందుకేనా!?

KCR: తలపై టోపీ.. కేసీఆర్ కొత్త సెంటిమెంట్ అందుకేనా!?

KCR: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం. రెండు యాగాలతో ఘనంగా జరిగింది కార్యక్రమం. యాగకర్త కేసీఆర్ కు అంతా శుభాకాంక్షలు చెప్పారు. అంతా బాగుంది. గులాబీ బాస్ ఉత్సాహంగా కనిపించారు. పూర్తిగా సంప్రదాయబద్దంగా జరిగిన ఆ ప్రోగ్రామ్ లో.. ఒక్కటి మాత్రం కాస్త హార్డ్ గా కనిపించిందని అంటున్నారు. ఈ ఈవెంట్ చూసిన వారంతా.. అదేంటి? అది అవసరమా? అనుకునే ఉంటారు. అదే కేసీఆర్ తలపై టోపీ.


అవును, ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగినంత సేపు కేసీఆర్ తలపై నుంచి టోపీని మాత్రం తీయనే లేదు. పూజలు చేస్తున్న టైమ్ లో కూడా టోపీ అలానే ఉంచుకున్నారు. అలా అని అక్కడేం ఎండ పడటం లేదు. పందిరి కిందనే ఉన్నా.. ఏసీ రూమ్ లో ఆసీనులైనా కూడా.. కేసీఆర్ తలపై టోపీ అలానే ఉంది. ఎందుకు? ఇలాంటి కార్యక్రమంలో ఆ టోపీ ఎందుకు?

గతంలో బహిరంగ సభలకు హాజరైనప్పుడు మాత్రమే అలాంటి పోటీ ధరించేవారు. ఫాంహౌజ్ లో ఉన్నప్పుడు కూడా ఆ టైప్ టోపీ కనిపించేది. ఇక ఎండాకాలం ఎప్పుడు బయటకు వచ్చినా.. ఎలాంటి విజిట్స్ చేసినా.. ఆ క్యాప్ కామన్. అంతేగానీ, ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు, మీటింగ్స్ నిర్వహించినప్పుడు మాత్రం మామూలుగానే ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఏకంగా యాగం చేసే సమయంలోనూ.. కార్యాలయ ప్రారంభోత్సవంలోనూ కేసీఆర్ తలపై టోపీ ఉండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


బహుషా కేసీఆర్ కు టోపీ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారేమో అంటున్నారు. ఆయనకే అనిపించిందో.. లేదంటే ఎవరైనా చెప్పారో తెలీదు గానీ.. టోపీ వెనకాల ఏదో కారణమే ఉండి ఉంటుందని చర్చించుకుంటున్నారు. గులాబీ బాస్ కు సెంటిమెంట్లు ఎక్కువ. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పటి వరకు సచివాలయంలో అడుగుపెట్టలేదని.. ఏకంగా సెక్రటేరియట్ కూల్చేసి వాస్తుకు అనుకూలంగా కొత్త సచివాలయమే కట్టిస్తున్నారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఇక, సీఎం అయిన కొత్తలో.. బ్లాక్ కలర్ కాన్వాయ్ ను వైట్ కలర్ కు మార్చేయడం కూడా సెంటిమెంటే అన్నారు. బహిరంగ సభలకు హాజరయ్యే ముందు చేతికి ముస్లిం సంప్రదాయానికి చెందిన ఎర్రటి వస్త్రం(దట్టీ) కట్టుకునే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. ఇలా ఈ కోవలోనే.. కొత్తగా తలకు టోపీ పెట్టుకునే సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్నారా? అనే డౌటనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×