 
					కొన్నిసార్లు శత్రువులను బుక్ చేయాలనుకునే ప్రయత్నంలో తమకు తామే గోతిలో పడుతారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భూ వివాదంలో ముస్లీంతో ఉన్న గొడవను ఆసరాగా చేసుకుని వారిని ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని హిందూ యువకులు ప్లాన్ చేశారు. కానీ, చివరకు అది తమ మెడకు చుట్టుకుంటుందని, జైల్లో చిప్పకూడదు తినాల్సి వస్తుందని ఊహించలేదు. ఇంతకీ ఈ కేసు కథ ఏంటంటే…
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ‘ఐ లవ్ మొహమ్మద్’ వివాదం రాజుకుంటుంది. ఈ గొడవను తమకు అనుకూలంగా మార్చుకొని ముస్లీంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు కొంత మంది హిందూ యువకులు. అనుకున్నట్లుగానే అలీఘర్ లోని దేవాలయాల గోడలపై ‘ఐ లవ్ మొహమ్మద్’ అంటూ రాశారు. ఈ రాతలు రాసింది సదరు ముస్లీం యువకులే అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఈ రాతల్లో స్పెల్లింగ్ మిస్టేక్ వారిని బుక్ చేసింది. చివరికి పోలీసులు సదరు హిందూ యువకులను అరెస్ట్ చేశారు. భూ వివాద కేసులో తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలనే కారణంతో హిందూ యువకులే ఈ కుట్ర చేశారన్నారు పోలీసులు. “ఈ కేసుకు సంబంధించి దిలీప్ కుమార్, ఆకాష్, అభిషేక్ సరస్వత్, నిశాంత్ కుమార్ ను అరెస్ట్ చేశాం. కుట్రకు అసలు సూత్రధారి అయిన రాహుల్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తాం. భూ వివాదంలో ప్రత్యర్థులను ఇరికించడానికి ఈ ఐదుగురు కుట్ర చేశారు” అని అలీఘర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ కుమార్ తెలిపారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గత శనివారం లోధా ప్రాంతంలోని భగవాన్ పూర్, బులాకిగఢ్ గ్రామాల్లోని ఆలయ గోడలను నిందితులు ధ్వంసం చేసి, మతాల మధ్య చిచ్చురేపేలా రాతలు రాశారు. ఈ తప్పను ప్రత్యర్ధుల మీదికి నెట్టే ప్రయత్నం చేశారు. అక్టోబర్ 25న, పోలీసులు ఈ విషయం తెలుసుకుని గ్రామానాకి వెళ్లారు. ముందుగా మౌల్వి ముస్తకీమ్, గుల్ మొహమ్మద్, సులేమాన్, సోను, అల్లాబక్ష్, హసన్, హమీద్, యూసుఫ్ లపై కేసు నమోదు చేశారు.
ఆయా దేవాలయాల మీద రాసిన రాతలను పోలీసులు పరిశీలించారు. ‘ఐ లవ్ ముహమ్మద్’ లో స్పెల్లింగ్ మిస్టేక్ గుర్తించారు. గత నెలలో బరేలీలోని ఉద్రిక్తతలకు దారితీసిన బ్యానర్ల కంటే ఈ రాతలు డిఫరెంట్ గా కనిపించాయి. అయితే, ఈ అంశంపై పోలీసులు లోతుగా విచారించారు. సిసిటివి ఫుటేజ్, కాల్ రికార్డులను పరిశీలించారు. ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అసలు నిందితులను పట్టుకున్నారు. ఈ కుట్రలో దిలీప్ కుమార్, ఆకాష్, అభిషేక్ సరస్వత్, నిశాంత్ కుమార్ పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగా నిందితులు తమ ప్రత్యర్థులను బుక్ చేసేందుకు ఈ కుట్ర చేసినట్లు ఎస్‌ఎస్‌పి నీరజ్ కుమార్ వెల్లడించారు. BNSలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
थाना लोधा पर पंजीकृत मु0अ0सं0 303/25 धारा 299/351(2)/ 192/197/229/61(2)BNS व 7 सीएलए एक्ट में वांछित अभियुक्तों की गिरफ्तारी के संबंध में वरिष्ठ पुलिस अधीक्षक महोदय द्वारा दी गई बाइट-#Aligarhpolice@Uppolice @dgpup @adgzoneagra pic.twitter.com/81GmGqBPtA
— ALIGARH POLICE (@aligarhpolice) October 30, 2025
Read Also: ట్రాఫిక్ పోలీసులకు షాక్.. ఫైన్ కట్టాలని బైక్ ఆపిన యువకుడు!