E-Paper
Advertisement

Revanth Reddy: రాహుల్‌గాంధీ అర్హతలు ఇవే.. కేసీఆర్‌కు రేవంత్ ఛాలెంజ్..

Revanth Reddy: రాహుల్‌గాంధీ అర్హతలు ఇవే.. కేసీఆర్‌కు రేవంత్ ఛాలెంజ్..
Advertisement
revanth-reddy

Revanth Reddy: ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్న అధికార బీఆర్ఎస్ మంత్రులపై.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎటాక్ చేశారు. వేల కోట్లు దోచుకుని, వందల ఎకరాల సంపాదించుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. అలాంటి వారు రాహుల్ ను విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రాష్ట్రానికి గుదిబండగా మార్చారని.. ఆయకట్టు విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కాకి లెక్కలే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాగ్ ఇచ్చిన నివేదికపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు రేవంత్‌రెడ్డి.

ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జనను అడ్డుకునేందుకు ఓ సైకో మంత్రి ప్రయత్నం చేశాడని రేవంత్ మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అనడం బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం అన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా.. రాహుల్‌‌గాంధీ ఎలాంటి పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిందని.. రాహుల్‌ అర్హత గురించి మాట్లాడే అర్హత అవినీతిపరులైన కేసీఆర్ కుటుంబానికి ఎక్కడ ఉందని నిలదీశారు రేవంత్‌రెడ్డి.

Advertisement

కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును.. రీడిజైన్‌ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారని రేవంత్‌ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగని.. ఎంత ఖర్చు చేసినా దానికి సరిపోవడం లేదని.. ఈ విషయం కాగ్‌ తన నివేదికలో తెలిపిందని అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని.. 2014 జూన్‌2 నాటికి కేసీఆర్‌ కుటుంబ ఆస్తులెన్ని? 2023 జులై 2న ఖమ్మంలో రాహుల్ సభ జరిగిన నాటికి కేసీఆర్ ఆస్తులు ఎన్ని? ఈ విషయంలో చర్చకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు రేవంత్.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×