BigTV English

Revanth Reddy: పొలం దున్నుదాం రా.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్..

Revanth Reddy: పొలం దున్నుదాం రా.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్..
revanth ktr

Revanth Reddy vs Minister KTR(Latest political news telangana): టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అమెరికా నుంచి తిరిగొచ్చారు. వచ్చీ రాగానే.. కేసీఆర్ అండ్ కో పై విరుచుకుపడ్డారు. యూఎస్‌లో ఉచిత విద్యుత్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్‌.. తనకున్న ఐటీ నైపుణ్యంతో.. తాను మాట్లాడిన వేరు వేరు మాటలను ఎడిట్‌ చేసి వైరల్ చేశారని.. ప్రజలను తప్పుదారి పట్టించారని ఫైర్ అయ్యారు. గతంలో ఉచిత విద్యుత్ ఇచ్చిందీ.. భవిష్యత్తులోనూ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు రేవంత్‌రెడ్డి.


చంద్రబాబు హయాంలో బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనకు.. కేసీఆరే కారణమని కొత్త విషయం చెప్పారు రేవంత్. ఆ సమయంలో కేసీఆర్ టీడీపీలో కీలకమైన మానవ వనరుల విభాగానికి ఛైర్మన్‌గా ఉన్నారని.. కేసీఆర్ ఇచ్చిన రిపోర్టుతోనే ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబుతో చెప్పించారని.. బహీర్‌బాగ్‌లో వామపక్షాలు, రైతులను కాల్చి చంపించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ సీఎం అయ్యాక.. ఉచిత విద్యుత్‌పైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి. కమీషన్ల కోసమే కేసీఆర్.. భారీగా విద్యుత్ కొంటున్నారని.. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వట్లేదని ఆరోపించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో చిప్పలు కడిగిన కేటీఆర్‌కు వ్యవసాయం అంటే తెలీదని విమర్శించారు. తాను గతంలో వ్యవసాయం చేశానని.. నాగలి పట్టి దుక్కి దున్నానని చెప్పారు. దమ్ముంటే.. పొలం దున్నడంలో తనతో కేటీఆర్ పోటీకి రావాలని సవాల్ విసిరారు రేవంత్‌రెడ్డి.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×