E-Paper
Advertisement

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పేదల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోందని స్పష్టం చేస్తూ, ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు

Advertisement

ఈ సారి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి బిజెపి ప్రభుత్వం సరికొత్త ప్రయోగాలకు తెరలేపిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు మతం, భాష పేరుతో ఓట్లు అడిగిన మోదీ సర్కార్, ఆ తర్వాత ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు వాడుకుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇవేవీ పనిచేయవనే ఉద్దేశంతోనే, ఇప్పుడు ఏకంగా 13 కోట్ల ఓట్లను తొలగించి మళ్లీ గెలవాలని చూస్తున్నారని, దీనికోసం కేంద్ర ఎన్నికల కమిషనర్ సహాయం తీసుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

బ్రిటీషర్లతో పోలిక.. రాహుల్ పోరాటం

Advertisement

నాడు బ్రిటీష్ పాలకులు భారతీయులను అణచివేయడానికి సైమన్ కమిషన్ ను ఉపయోగిస్తే.. నేడు బీజేపీ ‘ఎన్నికల కమిషన్’ను వాడుకుంటోందని రేవంత్ రెడ్డి పోల్చారు. స్వతంత్ర భారతంలో ఓటు ఉన్నవారిని, ఓటు లేనివారిని వేర్వేరుగా చూపిస్తూ ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ ఎలాగైతే పోరాటం చేశారో, నేడు పేదలు, బలహీన వర్గాల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ అదే రీతిలో పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య మాత్రమే కాదని, దేశంలోని పేదలందరి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

సీఈసీ తొలగింపునకు డిమాండ్

ప్రధాని నరేంద్ర మోదీ పంతాలకు పోయి దేశ ప్రజలను రెండుగా విభజించడం సరికాదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఏం జరిగిందో, మోదీ విషయంలో కూడా అదే పునరావృతమవుతుందని, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్ఆర్ ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని, ఈ ఎస్ఆర్ (SR) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

Tags

Related News

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

Big Stories

Advertisement
×