E-Paper
Advertisement

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!
Advertisement

Minority Welfare: హైదరాబాద్‌లోని మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో పాటు TMREIS వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, ఇతర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Advertisement

ఈ సందర్భంగా ఫహీమ్ ఖురేషీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. సాధారణంగా చెడును బయట చెప్పి మంచిని చెవిలో చెబుతుంటారని, కానీ ప్రభుత్వం అందిస్తున్న మంచితనాన్ని, పథకాలను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కావాలని కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతీ కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని స్పష్టం చేశారు.

విదేశీ విద్యకు రేవంత్ సర్కార్ చేయూత

Advertisement

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లలేకపోయేవారని ఫహీమ్ ఖురేషీ తన స్వ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మా ఇంట్లో ముగ్గురం అన్నదమ్ములం ఉన్నా ఆర్థిక స్తోమత లేక ఆనాడు విదేశాలకు వెళ్లలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏటీసీ (ATC) సెంటర్లలో మెరిట్ లిస్టులో నిలిచే పదిమంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని తెలిపారు.

పాన్, జర్మనీల్లో చదువుకునే ఛాన్స్!

జపాన్, జర్మనీ, సౌత్ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయూతనిస్తోందన్నారు. కాబట్టి మైనారిటీ విద్యార్థులు వెంటనే ఏటీసీలలో చేరి, సరైన శిక్షణ తీసుకొని విదేశీ విద్య అవకాశాలను అందుకోవాలని ఆయన సూచించారు.

Also Read: మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

Tags

Related News

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

Big Stories

Advertisement
×