E-Paper
Advertisement

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..
Advertisement

మనం ఎదగడం కాదు.. మన ఎదుగుదలకు కారణమైనవారిని కూడా మనతోపాటూ ఎదగనివ్వడమే అసలైన విజయం. ఉద్యోగులకు జీతం పడేస్తే పనిచేస్తారులే అని కొంతమంది బాస్‌లు అనుకుంటారు. కానీ, ఆ సంస్థ ఎదుగుదలకు పునాదులు వారే అనే విషయాన్ని గ్రహించలేరు. కొందరు మాత్రం.. ఉద్యోగులను తమ సొంత ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. వారి కష్టాన్ని గుర్తించి.. తగిన జీతాలు, బోనస్‌లు ఇస్తారు. షేర్లు సైతం ఇచ్చి సంతోషపెట్టిన బాసులు కూడా ఉన్నారు. ఆ జాబితాలో తాజాగా చైనాకు చెందిన ఓ లేడీ బాస్ సైతం చేరారు.

ఉత్తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు..

చైనాకు చెందిన మా యాన్లీ అనే మహిళ.. హెనాన్ ప్రావిన్స్‌లోని జియాయోజులో బియాంగ్ బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్లు నెడుపుతున్నారు. ఇటీవల ఆమె.. తన ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ రెస్టారెంట్ కోసం ఎండా, వాన, చలి అని చూడకుండా కష్టపడుతున్న ఉద్యోగులను గుర్తించింది. వారికి BMW కార్లను ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇకేం ఉంది.. ఈ వార్త దావనంలా వ్యాప్తి చెందింది. ఈ విషయం తెలిసి.. నిజంగా ఆ లేడీ బాస్ దేవత అని అంటున్నారు జనం.

తీవ్రమైన చలిని తట్టుకోలేక…

Advertisement

తమ ఉద్యోగులు తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రావడం చూసి యాన్లీ చలించిపోయింది. ఖర్చును కూడా లెక్క చేయకుండా.. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన ఇద్దరికి ఏకంగా రూ.52 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కార్లను ఇచ్చింది. అయితే, ఈ విషయాన్ని ఆమె ముందుగా వారికి చెప్పలేదు. బయటకు వెళ్దాం.. పదండి అంటూ.. బీఎండబ్ల్యూ కార్ల షో రూమ్‌కు తీసుకెళ్లింది. ఆ కార్ల తాళాలు వారి చేతుల్లో పెట్టి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి షరతులు, అగ్రిమెంట్లు లేకుండా నేరుగా ఉద్యోగుల పేరు మీదనే కార్లను రిజిస్ట్రేషన్ చేయించడం విశేషం.

Also Read: ‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

ఆమె పరిస్థితిని చూసి.. చలించిపోయాను: యాన్లీ

Advertisement

యాన్లీ ఏ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది చలికాలంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎనిమిదేళ్లుగా నా దగ్గర పనిచేస్తున్న లీ జీ అనే మహిళా ఉద్యోగి ఒకరోజు ఉదయం.. విపరీతమైన చలిగాలుల్లో స్కూటర్‌పై ఆఫీసుకు వచ్చింది. చలికి ఆమె ముఖం, చెవులు ఎర్రబడి, చేతులు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమెను అలా చూసి మనసు చలించిపోయింది. నేను కారులో హాయిగా వెచ్చగా ప్రయాణిస్తున్నా. అలాంటిది నా సంస్థ విజయానికి రాత్రిబంవళ్లు కష్టపడే నా ఉద్యోగి ఎందుకు ప్రయాణించకూడదు. కంపెనీ సాధించిన విజయంలో నా ఉద్యోగులకు కూడా భాగస్వామ్యం ఉండాలని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని ఆమె తెలిపారు. లీజీతోపాటు ల్యూ ఇంగ్ ఇంగ్ అనే మరో ఉత్తమ ఉద్యోగికి కూడా ఆమె బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా ఇచ్చారు.

Also Read: ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

Tags

Related News

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×