E-Paper
Advertisement

సౌత్ అయినా.. నార్త్ అయినా సీఎం రేవంత్ వ్యూహం ఓక్కటే.. అటాక్ మోడీ!

సౌత్ అయినా.. నార్త్ అయినా సీఎం రేవంత్ వ్యూహం ఓక్కటే.. అటాక్ మోడీ!
Advertisement

Revanth Reddy: కేరళలో దక్షిణాది హక్కులపై గళమెత్తారు. మహారాష్ట్రలో పెట్టుబడుల తరలింపుపై ప్రశ్నించారు. బీజేపీ వల్లే గోవా డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్నారు. సౌత్ సైడ్ వచ్చినా, నార్త్ సైడ్ వెళ్లినా.. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి అంటిస్తున్న చురకలు మామూలుగా లేవు. ఘాటు కామెంట్స్‌తో హీటు పెంచుతున్నారు. ఏ రాష్ట్రంలో పర్యటించినా పొలిటికల్ అటాక్ బీజేపీపైనే. దక్షిణాది హక్కుల కోసం రేవంత్ గళం వినిపిస్తున్నారు.

త్రీడీ అస్త్రం..

కేంద్రంపై త్రీడీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నిలదీస్తున్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు పెట్టుబడులు తరలించుకుపోయారని ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం. మోడీ దేశానికి కాదు గుజరాత్‌కే ప్రధాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కూడా పెట్టుబడుల హక్కు ఉందంటూ టెస్లా, ఫాక్స్‌కాన్ అంశాలను ప్రస్తావించారు.

Advertisement

Also read: విశాఖ మేయర్ రేసులో చాలామంది ప్రముఖులు.. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని కూడా!

గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్..

దేశ రాజకీయాల్లో రేవంత్ కొత్త స్లోగన్‌తో ముందుకెళ్తున్నారు. గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన రాజకీయ ఆకాంక్ష అంటూ ప్రకటించారు. గోవాలో బీజేపీని రావణుడితో పోల్చిన రేవంత్ కాంగ్రెస్‌ని రాముడిగా అభివర్ణించారు. డ్రగ్స్, భూ వ్యవహారాలు, నిరుద్యోగంపై గోవా ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా ఓటర్ జాబితా సవరణపై కేంద్రం, ఎన్నికల సంఘం తీరుపై రేవంత్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. సౌత్ నుంచి నార్త్ దాకా.. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి పిలుపునిచ్చినా రేవంత్ అవసరమైన చోటల్లా ల్యాండ్ అవుతున్నారు. కాంగ్రెస్ సౌండ్‌ని.. ఇండియా గ్రౌండ్ అంతటా వినిపించేలా చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దూకుడు..

Advertisement

తెలంగాణ నుంచి జాతీయ వేదికల దాకా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీపై విమర్శల దాడి, దక్షిణాది హక్కుల నినాదం, రాహుల్ నాయకత్వానికి బలమైన మద్దతుగా నిలుస్తా.. జాతీయ రాజకీయాల్లో రేవంత్ తన ప్రత్యేకత చాటుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు రేవంత్ టార్గెట్ ఏంటి? జాతీయ రాజకీయాల్లో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Also read: యాసంగిలో వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు: మంత్రి తుమ్మల

Tags

Related News

పాత నోట్ల పేరుతో రూ.70 కోట్ల దందా.. AIని వాడి విచిత్ర మోసం!

యాసంగిలో వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు: మంత్రి తుమ్మల

సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం బంపర్ ఆఫర్.. దసరా బోనస్ ఎంతంటే?

తెలంగాణలో గుబులు రేపుతున్న ఫేక్ సర్టిఫికెట్ల అంశం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి, బీఆర్ఎస్‌లో వణుకు

రాహుల్ గజం ఎగిరితే.. రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నాడు!: కిషన్ రెడ్డి

క్యూర్ చట్టం ఎఫెక్ట్‌.. మున్సిపల్ పాలనలో ఇక అంతా పబ్లిక్‌!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

Big Stories

Advertisement
×