E-Paper
Advertisement

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?
Advertisement

Horror Movies on OTT : హారర్ సినిమాలు చూడటమంటే చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా పాడుబడిన భవనాలు, అర్ధరాత్రి వినిపించే వింత శబ్దాలు, అంతుచిక్కని మరణాలు, కనిపించకుండా పోయే మనుషులు… ఇలాంటి అంశాలు ఉంటే కథపై ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ వారం ఓటీటీలోనూ అలాంటి భయానక కథలు ప్రేక్షకులను పలకరించాయి. అంగారక గ్రహంలో జరిగే వింత సంఘటనల నుంచి, దెయ్యాల ఉనికిని సవాలు చేసే కథలు, హాంటెడ్ స్కూల్‌లో చిక్కుకున్న యువత కథ వరకు నాలుగు విభిన్నమైన హారర్‌ చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. మరి అవి ఏ ఓటీటీలో ఉన్నాయి ? అందులో తెలుగులో ఎన్ని ఉన్నాయి ? అన్నది తెలుసుకుందాం పదండి.

‘జాన్ కార్పెంటర్స్ ఘోస్ట్ ఆఫ్ మార్స్’ (John Carpenter’s Ghost of Mars)

కథ 2176లో అంగారక గ్రహంపై జరుగుతుంది. అక్కడి ఓ గనుల ప్రాంతానికి పోలీసుల బృందం వెళ్తుంది. ఓ నేరస్థుడిని అదుపులోకి తీసుకురావడమే వారి లక్ష్యం. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కనిపించని శత్రువుల దాడులు, అంతుచిక్కని సంఘటనలు, ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే పోరాటం ఆ బృందాన్ని ప్రమాదంలోకి నెడతాయి. సైన్స్‌ ఫిక్షన్‌, యాక్షన్‌, హారర్‌ కలిసిన ఈ చిత్రం భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

‘ఇన్‌సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్’ (Insidious Out of the Further)

Advertisement

ఇందులో జెమ్మా అనే ఆవిడకి చనిపోయిన ఆత్మలు ఉన్న మరో లోకంలోకి వెళ్లగలిగే శక్తి ఉందని తెలుస్తుంది. అయితే ఆ శక్తి ఆమెకు వరంగా మారుతుందా, శాపంగా మారుతుందా అన్నది అసలు సమస్య. ఆ లోకంలోని దుష్టశక్తులు మనుషుల ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నించడంతో ఆమె తన కూతురిని కాపాడుకునేందుకు పోరాడాల్సి వస్తుంది. కనిపించని శక్తుల వెనుక ఉన్న ప్రమాదమే ఈ కథలో భయాన్ని పెంచుతుంది.

క్యారీ (Carrie)

ఈ సిరీస్‌లో క్యారీ వైట్ అనే యువతి పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపులను ఎదుర్కొంటుంది. ఇంట్లోనూ ఆమెకు స్వేచ్ఛ ఉండదు. తనలో ఉన్న అసాధారణ శక్తులు బయటపడటంతో పరిస్థితులు మరింత భయానకంగా మారతాయి. ఇతరుల అవమానాలు, ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఈ కథలో కీలకం.

వీడియో (Video)

Advertisement

ఇది కన్నడ ఫౌండ్‌-ఫుటేజ్‌ హారర్‌ చిత్రం. లక్ష మంది ఫాలోవర్స్ ను సంపాదించిన సంబరంలో ఓ యూట్యూబ్ బృందం పాడుబడిన పాఠశాలను సందర్శిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో అక్కడికి వెళ్లొద్దనే హెచ్చరికను పట్టించుకోకపోవడంతో ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతారు. ఆ తర్వాత దొరికిన కెమెరా దృశ్యాల ద్వారా అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది.

Also Read : చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

క్యారీ, వీడియో చిత్రాలకు తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. ఇవి రెండూ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘ఇన్‌సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్’ ప్రైమ్ వీడియోలో అద్దెకు ఉంది. అయితే తెలుగు ఆడియో లేదు. ‘ఘోస్ట్స్ ఆఫ్ మార్స్’ నెట్‌ఫ్లిక్స్‌ ఉంది.

Related News

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్

బాక్సింగ్ రింగ్‌లో ప్రపంచాన్ని వణికించిన మైక్ టైసన్… కట్ చేస్తే వివాదాలు, జైలు జీవితం, పతనం

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

Big Stories

Advertisement
×