BigTV English

RevanthReddy: తగ్గిన రేవంత్.. నెగ్గిన సీనియర్స్.. పాదయాత్రలో అందరూ..

RevanthReddy: తగ్గిన రేవంత్.. నెగ్గిన సీనియర్స్.. పాదయాత్రలో అందరూ..

RevanthReddy: త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర. జనవరి 26 నుంచి యాత్ర స్టార్ట్. మాగ్జిమమ్ నియోజక వర్గాలను కవర్ చేసేలా పీసీసీ చీఫ్ పాదయాత్ర చేయనున్నారు. పార్టీలో నూతనోత్సాహం నింపనున్నారు. ఇదీ ఇప్పటి వరకూ జరిగిన ప్రచారం.


రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ రెబెల్ సీనియర్స్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. హాత్ సే హాత్ జోడోపై ఏఐసీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ లో టీపీసీసీ చీఫ్ మాత్రమే పాదయాత్ర చేయాలని ఎక్కడా లేదని.. కావాలనే రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి గతంలోనే తప్పుబట్టారు. ఇదే విషయం టి.కాంగ్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేకు కూడా వివరించారు.

అసలే, సీనియర్లు. చాలామందే ఉన్నారు. అంతాకలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పాదయాత్ర రేవంత్ రెడ్డి ఒక్కరే చేస్తే తాము సహకరించలేదని తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక.. హాత్ సే హాత్ జోడో యాత్రలో పార్టీ నేతలంతా భాగస్వాములు అవుతారంటూ తాజాగా నిర్ణయించారు. నియోజక వర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ఎక్కడి నేతలు అక్కడ యాత్ర చేపడతారు. ఈ విషయం స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ప్రకటించారు.


మొదట జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ఉంటుందని ప్రకటించగా.. ఇంకా రాహుల్ పాదయాత్ర పూర్తి కాకపోవడంతో.. డేట్ మార్చారు. ఫిబ్రవరి 6 నుంచి ఏకధాటిగా 60 రోజుల పాటు కార్యక్రమం కొనసాగనుంది. గతంలో ప్రకటించిన జనవరి 26న జాతీయ జెండాతో పాటు కాంగ్రెస్ జెండా కూడా ఎగరేసి.. లాంఛనంగా హాత్ సే హాత్ జోడో ను ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని.. పార్టీ నేతలంతా ఇందులో పాల్గొంటారని రేవంత్ తెలిపారు. యాత్ర మాత్రం ఫిబ్రవరి 6 నుంచి జరగనుంది.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని ప్రతీ పౌరుడికి తెలియజెప్పే కార్యక్రమమే హాత్ సే హాత్ జోడో. రాహుల్ గాంధీ మెసేజ్ ను కరపత్రాల్లో ముద్రించి.. ఇంటింటికీ వెళ్లి అందజేస్తారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో జరిగే యాత్రకు ఒకరోజు సోనియాగాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ హాజరవుతారని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇక, హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని పార్టీ నేతలంతా గ్రాండ్ సక్సెస్ చేయాలని రేవంత్ పిలుపు ఇచ్చారు. సరిగా పట్టించుకోని నాయకులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ నేతలెవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని.. చేస్తే ఊరుకునేది లేదని.. వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×