E-Paper

ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!

ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!
Advertisement

CM Revanth Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తే.. కాంగ్రెస్ సర్కార్ విద్యను వికాసం వైపు నడిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ లో 8.5 శాతం విద్యకే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రూ.26,600 కోట్లు విద్యాశాఖకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చాకే విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిందని గుర్తుచేశారు. ఈ నిధులను ప్రతీ నెలా తప్పకుండా విద్యార్థులకు అందజేసేలా అధికారులను ఆదేశించామని రేవంత్ అన్నారు.

విద్యాశాఖను ప్రక్షాళన చేసి.. ప్రతీ పేదవాడి గుండెను తట్టాలనే ఉద్దేశంతోనే తాను విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే దేశానికే యువత ఆదర్శం కాగలదని అభిప్రాయపడ్డారు. 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. ఆరుట్లలో ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్లు అన్నీ ఫుల్ అయ్యాయని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో నో పర్మిషన్ బోర్డ్ పెట్టే పరిస్థితి ఎవరూ ఉహించి ఉండరని పేర్కొన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలని ఆకాంక్షించారు.

Advertisement

Also Read: తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు.. ప్రారంభించిన పవన్

Advertisement

మరోవైపు క్రీడల గురించి ప్రస్తావించిన రేవంత్.. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒలిపింక్స్ లో గోల్డ్ మెడల్ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దీన్ ద్వారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. అటు ఏఐతో వైట్ కాలర్ జాబ్స్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు రేవంత్ తెలిపారు. అయితే స్కిల్ తో సంబంధమున్న బ్లూ కాలర్ ఉద్యోగాలకు మాత్రం ఏఐతో ఎలాంటి ముప్పు లేదని భరోసా కల్పించారు.

Also Read: ఇయర్ బడ్స్ ఉన్నాయా? అయితే మీరే సూపర్ హ్యూమన్.. ఎవరికీ తెలియని 6 సీక్రెట్స్!

Related News

South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు.. ప్రారంభించిన పవన్

Jana Sena: తెలంగాణ లీడర్లకు జనసేన గాలం.. అలాంటి నేతలే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం!

Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!

Big Stories

×