E-Paper
Advertisement

వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!

వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!
Advertisement

Allu Arjun: తగ్గేదేలే అనే డైలాగ్‌తో వరల్డ్‌వైడ్‌ ఫేమస్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇప్పుడు తగ్గాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయనకు ఒకేరోజు రెండు షాక్‌లు తగిలాయి. తన సినిమా రిలీజ్ వేళ థియేటర్‌ వచ్చిన అల్లు అర్జున్‌ను చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ ఊగిపోవడమే.. ఒక ప్రాణాన్ని బలితీసుకుంటుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ సాక్షిగా జరిగిన ఈ దారుణం ఇప్పుడు పుష్పరాజ్‌ను వెంటాడుతూనే ఉంది. చాలా నెలల తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టు మరోసారి అతడికి నోటీసులు జారీ చేసింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..

కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్నది నాంపల్లి కోర్టు. ఇది బన్నికి తగిలిన మొదటి షాక్. మరి అతను విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం తాను ముంబైలో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. అందువల్ల సోమవారం జరిగే విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు డిస్మిస్ చేసింది. ఇది రెండో షాక్. వ్యక్తిగతంగా హాజరైన తర్వాతే కేసు విచారణ ముందుకు సాగుతుందని ధర్మాసనం క్లియర్‌ కట్‌గా చెప్పేసింది. సో.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అల్లు అర్జున్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాక తప్పని పరిస్థితి.

Advertisement

Also read: పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగినా మీకు ఆ అర్హత రాదు.. పేర్ని నానికి కిరాక్ ఆర్పీ లెఫ్ట్ అండ్ రైట్!

సంధ్య థియేటర్..

2024 డిసెంబర్ 4న.. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షోను సంధ్యా థియేటర్‌లో వేశారు. అప్పుడు సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రాకతో భారీగా అభిమానులు తరలివచ్చారు. దురదృష్టవశాత్తు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

స్వయంగా హాజరవుతారా? లేదా?

Advertisement

ఈ తొక్కిసలాట ఘటనలో మొత్తం 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇందులో A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. A11గా హీరో అల్లు అర్జున్ పేరును చేర్చారు. మరి నోటీసులు రావడం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరటం దానికి కోర్టు కుదరదని చెప్పడం అన్ని జరిగిపోయాయి. మరి కోర్టు ఆదేశాలను పాటిస్తూ బన్ని సోమవారం విచారణకు స్వయంగా హాజరవుతారా? లేదా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Storey By: Appa Rao Big Tv

Also read: గుడ్ న్యూస్.. 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్

Related News

బిగ్ టీవీ కథనాలకు భారీ ఇంపాక్ట్.. మెట్రో పిల్లర్ల తవ్వకాలపై కళ్లు తెరిచిన అధికారులు!

కేటీఆర్ ఆస్తులపై దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. త్వరలో బిగ్ ట్విస్ట్?

కొడంగల్ వేదికగా కల్వకుంట్ల కవిత,కేటీఆర్ పొలిటికల్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!

మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!

భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. వీసా ఫీజు పొడిగింపు!

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!

Big Stories

Advertisement
×