E-Paper
Advertisement

ఇయర్ బడ్స్ ఉన్నాయా? అయితే మీరే సూపర్ హ్యూమన్.. ఎవరికీ తెలియని 6 సీక్రెట్స్!

ఇయర్ బడ్స్ ఉన్నాయా? అయితే మీరే సూపర్ హ్యూమన్.. ఎవరికీ తెలియని 6 సీక్రెట్స్!
Advertisement

Earbuds Hidden Features: ఇయర్ బడ్స్ అనేవి కేవలం పాటలు వినడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడడానికే అనుకుంటే పొరపాటే. ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ల కంటే వేగంగా ఇయర్ బడ్స్ స్మార్ట్‌గా మారిపోతున్నాయి. చాలా మందికి తెలియని, కంపెనీలు పెద్దగా ప్రచారం చేయని ఎన్నో అద్భుతమైన ఫీచర్లు వీటిల్లో దాగున్నాయి. రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేసే ఆ ‘అజ్ఞాత’ ఇయర్ బడ్స్ ఫీచర్లపై ఈ ప్రత్యేక కథనం.

గుసగుసలు స్పష్టంగా వినేలా..

యాపిల్ ఎయిర్‌పాడ్స్‌తో పాటు చాలా ప్రీమియం ఇయర్ బడ్స్‌లో ‘లైవ్ లిజన్’ (Live Listen) లేదా సౌండ్ యాంప్లిఫికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించి ఫోన్ మైక్రోఫోన్ క్యాచ్ చేసే శబ్దాలను నేరుగా చెవుల్లోని ఇయర్ బడ్స్ ద్వారా వినవచ్చు.

రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్

Advertisement

విదేశాలకు వెళ్లినప్పుడు, తెలియని భాష మాట్లాడే వ్యక్తితో సంభాషించాల్సి వచ్చినప్పుడు ఇయర్ బడ్స్ ‘ట్రాన్స్ లేటర్’ గా వాడుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ బడ్స్, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ వంటివి గూగుల్ అసిస్టెంట్, గెలాక్సీ AI సాయంతో రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ అందిస్తున్నాయి.

‘ఫిట్‌నెస్ ట్రాకర్స్’

ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఇయర్ బడ్స్‌లో హార్ట్ రేట్ (గుండె వేగం) మానిటర్స్, బాడీ టెంపరేచర్ సెన్సార్లు, మోషన్ సెన్సార్లు ఉంటున్నాయి. రన్నింగ్ లేదా వర్కవుట్ చేస్తున్నప్పుడు చేతికి స్మార్ట్ వాచ్ లేకపోయినా ఈ ఇయర్ బడ్స్ గుండె వేగాన్ని, ఎన్ని అడుగులు వేశారో ఖచ్చితంగా లెక్కగట్టగలవని నిపుణులు పేర్కొంటున్నారు.

‘ఫైండ్ మై బడ్స్’ ఫీచర్

Advertisement

ఇయర్ బడ్స్ పరిమాణంలో చాలా చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో ఒకచోట మర్చిపోవడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు చాలా ఇయర్ బడ్స్ లో ‘ఫైండ్ మై బడ్స్’ అందుబాటులో ఉంది. బ్లూటూత్ పరిధిలో ఉంటే యాప్ ద్వారా వాటి నుంచి పెద్దగా బీప్ శబ్దం వచ్చేలా చేయవచ్చు. ఒకవేళ ఎక్కడో బయట పడేసుకుంటే అవి చివరిగా ఫోన్‌కు కనెక్ట్ అయిన జీపీఎస్ లొకేషన్‌ను మ్యాప్‌లో చూపిస్తాయి.

స్మార్ట్ టచ్, జెస్టర్ కంట్రోల్స్

సాధారణంగా ఇయర్ బడ్స్‌ లో సింగిల్ ట్యాప్ చేస్తే పాటలు రావడం, డబుల్ ట్యాప్ చేస్తే ఆగిపోవడం లేదా పాట మారడం మాత్రమే జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ ట్యాప్ సిస్టమ్ ను మనకు నచ్చిన విధంగా మార్చుకునే వెసులుబాటును ఇయర్ బడ్స్ ను కల్పిస్తున్నాయి. ఇయర్ బడ్స్ కు సంబంధించి కంపెనీ యాప్ లోకి వెళ్లి.. కుడి బడ్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ పెరగాలని, ఎడమ బడ్ ట్యాప్ చేస్తే గూగుల్/సిరి అసిస్టెంట్ ఆన్ అవ్వాలని సెట్ చేసుకోవచ్చు. నేరుగా వాయిస్ రికార్డర్ ఆన్ అవ్వాలని కూడా పెట్టుకోవచ్చు.

Also Read: టెలిగ్రామ్‌పై కేంద్రం బ్యాన్.. ప్రత్యామ్నాయ 5 యాప్స్ ఇవే.. సేఫ్ అండ్ సూపర్!

దూరం నుంచి ఫొటో క్లిక్

ఇయర్ బడ్స్‌లో ఉండే ‘ఇన్-ఇయర్ డిటెక్షన్’ సెన్సార్ల వల్ల మీరు చెవిలో నుంచి బడ్ తీయగానే పాట ఆగిపోతుంది. మళ్లీ పెట్టగానే ప్లే అవుతుంది. అయితే కొన్ని బ్రాండ్లలో ఇయర్ బడ్స్‌ను కెమెరా రిమోట్‌లా వాడుకోవచ్చు. ఫోన్‌ను దూరంగా ఉంచి గ్రూప్ ఫోటో దిగాలనుకున్నప్పుడు ఇయర్ బడ్స్ పై ట్యాప్ చేయడం ద్వారా ఫోటో క్లిక్ చేయవచ్చు.

Also Read: అసలెవరీ సాయికృష్ణ.. బతికున్నాడా? బలయ్యాడా? ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×