
Revanth Reddy: ప్లాట్‌ఫామ్ ఏదైనా.. రేవంత్‌రెడ్డి తగ్గేదేలే. రాజకీయ క్షేత్రంలో బీఆర్ఎస్ బరతం పడుతున్నారు. కేసీఆర్ పాలనను ప్రజల్లో ఎండగడుతున్నారు. కేటీఆర్‌ను మాటలతో కుళ్లబొడుస్తున్నారు. ప్రెస్‌మీట్లతో చుక్కలు చూపిస్తున్నారు. రేవంత్ దూకుడుకు గులాబీ దళం బేజారవుతోంది. అందుకే, పీసీసీ చీఫ్ గురించి ప్రతీచిన్న విషయాన్ని భూతద్దంలో బూచీగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్.
లేటెస్ట్‌గా రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్‌ను కలుసుకున్నారు. ఈయన ఆయన్ను కలవడం ఇదే తొలిసారి కూడా కాదు. ఇద్దరు పీసీసీ చీఫ్‌ల మధ్య అనేక పార్టీ వ్యవహారాలు ఉంటాయి. అవి ఎన్నికల వ్యూహాలైనా కావొచ్చు.. షర్మిల పార్టీ విలీనం గురించైనా అయ్యుండొచ్చు. ఇంతమాత్రానికే.. ఏదో జరిగిపోతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ, వయా బెంగళూరు.. ఆత్మగౌరవం, మోకరిల్లడం.. అంటూ పొలిటికల్ మసాలా దట్టించే ప్రయత్నం చేశారు. డీకేతో రేవంత్ భేటీ అయితే కవితకు అంత ఉలికిపాటు ఎందుకో?
రేవంత్ ఊరుకుంటారా? కవితకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. గల్లీలో సవాళ్లు, ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోళ్లు అంటూ.. ప్రధాని మోడీకి కేసీఆర్ నమస్కరిస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన నిక్కర్, లిక్కర్.. లాజిక్కు అంటూ ఎక్స్ చేశారు రేవంత్‌రెడ్డి.