
Vidadala Rajini news today(Political news in AP):
ఏపీ మంత్రి విడుదల రజిని మామ విడుదల లక్ష్మీనారాయణ.. ఓ కాంట్రాక్టర్‌పై దౌర్జన్యానికి దిగారు. కాంట్రాకర్‌ను చంపేస్తానంటూ గొంతు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి మధ్య చిలకలూరిపేటలోని పురుషోత్తంపట్నంలో నిర్మిస్తున్న టీటీడీ దేవాలయం నిర్మాణంలో వివాదం వచ్చినట్లుగా తెలుస్తోంది.
టీటీడీ AE, DEల క్వాలిటీ అప్రూవల్‌తోనే నిర్మాణం చేసానంటున్నాడు కాంట్రాక్టర్. ఐతే క్వాలిటీ బాగోలేదు డబ్బులు రిటన్ ఇవ్వాలని లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. కానీ లక్ష్మీనారాయణ తీరుతో వివాదం నెలకొందని కాంట్రాక్టర్ చెబుతున్నారు. మరోవైపు చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేశారు లక్ష్మీనారాయణ. అటు పోలీసులు సైతం మంత్రిగారి మామ కావడంతో సెటిల్ చేసుకోవాలని కాంట్రాక్టర్ కు సూచించినట్లు సమాచారం.
మరో ఘటనలో.. మంత్రి రజినీ ఓఎస్డీ, ఆరోగ్యశ్రీ అదనపు సీఈఓ మధుసూదనరెడ్డి.. 108 కాల్‌సెంటర్ ఉద్యోగిని కొట్టడం కలకలం రేపింది. తమపై దాడికి నిరసనగా.. ఉద్యోగులు పావుగంట పాటు కాల్స్ తీసుకోకుండా నిరసన తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్సు రాకలో జాప్యంతో రైలు ప్రమాద బాధితుడు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సీఎం కార్యాలయం వివరణ కోరింది. వెంటనే అదనపు సీఈవో మధుసూదనరెడ్డి మంగళగిరిలోని 108 కాల్‌సెంటర్ ఆఫీసుకు వెళ్లారు. జరిగిన ఘటనపై డ్యూటీలో ఉన్న ఉద్యోగిని తిడుతూ.. చేయి చేసుకున్నారు.
ఉన్నతాధికారి కొట్టడంపై 108 కాల్ సెంటర్ ఉద్యోగులు విధులు నిలిపేసి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. అధికారులు సిబ్బందికి సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సంఘటనపై మధుసూదనరెడ్డికి మెమో ఇవ్వాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.
Mamata Benerjee : ఇలాగే కొనసాగితే దేశంలో అధ్యక్ష పాలన తప్పదు : మమత