
Telangana congress news(TS politics):
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శత్రువు శత్రువు మిత్రుడు. బీ ప్రాక్టికల్. పక్కా పాలిటిక్స్. ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో కారులో కల్లోలం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ రేసుగుర్రంలా దూసుకుపోతుండటంతో.. చేతితో చేయి కలిపేందుకు నేతలు క్యూ కడుతున్నారు. మరీ, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి.
ఐదేళ్ల అవమానాలు పడలేక పొంగులేటి కారు దిగేశారు. కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనొక్కరే ఖమ్మం జిల్లాను టోటల్‌గా స్వీప్ చేయగల సత్తా ఉన్న లీడర్. అలాంటిది ఇప్పుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్ఎస్‌కు బై చెప్పేందుకు రెడీ అయ్యారు.రేపోమాపో కాంగ్రెస్‌లో చేరుతారని అంటున్నారు. ఇది కేసీఆర్‌కు మరింత బిగ్ షాక్.
తుమ్మల బలమైన నాయకుడు. ఖమ్మం జిల్లాలో ఆయనకు లక్షల్లో అభిమానులున్నారు. అలాంటి తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరితే.. పొంగులేటితో చేతులు కలిపితే.. మామూలుగా ఉండదు రాజకీయం.
బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు పొంగులేటి, తుమ్మల మధ్య కోల్డ్‌వార్ నడిచేది. ఒకేపార్టీలో ఉన్నా.. గడిచిన నాలుగేళ్లుగా వారిద్దరూ ఒక్కసారి కూడా కలిసింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వారిద్దరినీ ఒక్కటి చేసింది. పార్టీలోకి ఆహ్వానించేందుకు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. రండి..కలిసి పనిచేద్దాం అంటూ చేయి అందించారు. ఈ అరుదైన భేటీ ఖమ్మం రాజకీయాల్లో బిగ్ ఛేంజ్. సెప్టెంబర్ 6 లేదంటే 9వ తేదీన తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.
AP CM Jagan : కుప్పానికే నీళ్లు ఇవ్వలేదు.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు..