BigTV English

Revanth Reddy : వర్షాలపై కనీసం సమీక్ష చేయలేరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? : రేవంత్ రెడ్డి

Revanth Reddy : వర్షాలపై కనీసం సమీక్ష చేయలేరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? : రేవంత్ రెడ్డి
Revanth reddy comments on BRS Govt

Revanth reddy comments on BRS Govt(Latest news in telangana): హైదరాబాద్‌లో భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ విమర్శించారు. కనీసం వర్షాలు, ముంపు సమస్యలపై కనీసం సమీక్ష చేయకపోవడం బాధాకరమని అన్నారు.


ట్రాఫిక్ జామ్‌లతో భాగ్యనగంలో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని రేవంత్ అన్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు . హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని నిలదీశారు.

ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×