E-Paper
Advertisement

Revanth Tweet : కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు!.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

Revanth Tweet : కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు!.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Advertisement

Revanth Tweet : కాంగ్రెస్ నేతలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మొన్న మహేశ్వరం అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిపై ఐటీ దాడులు మరవకముందే నిన్న ఖమ్మం అభ్యర్థి తుమ్మల ఇంట్లో సోదాలు నిర్వహించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పై ఐటీ దాడులు జరుగుతాయి అని తెలిపిన 24 గంటల్లోపే.. పొంగులేటి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వరుస ఐటీ దాడులు కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేవు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు దేనికి సంకేతం అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు. బీజేపీ బీఆర్ఎస్ నేతల పై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నిన్న తుమ్మల నాగేశ్వర్ రావు అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నాయని అయన పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ రాబోతుందని అయన అన్నారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న మోడీ- కేడి భయపడుతున్నారని రేవంత్ తెలిపారు. ఈ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రం అని అయన మండిపడ్డారు. ఈ ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో.. కమలం, కారు గల్లంతవడం ఖాయం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×