Big Stories

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు!

Phone Tapping Case
Phone Tapping Case

Police Notice issued to BRS Leaders on Phone Tapping Case: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఖాకీలను విచారించిన అధికారులు, ఇక మీదట రాజకీయ నాయకులను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. 7 రోజుల కస్టడీ స్టేట్ మెంట్ లో ప్రణీత్ రావు పలువురు కీలక రాజకీయ నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లోని ఇద్దరు ముఖ్య నేతల పేర్లను తన స్టేట్ మెంట్ లో వెల్లడించినట్లు సమాచారం.

- Advertisement -

ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. వారి నుంచి ప్రణీత్ రావు చెప్పిన విషయాలకు సంబంధించిన సమాచారం సేకరించే అవకాశం ఉంది. వారిచ్చే సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోన్నారు. ఆ ఇద్దరు నేతలు ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

- Advertisement -

మరోవైపు.. తిరుపతన్న, భుజంగరావులను 10 రోజుల కస్టడీ కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 గా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌ రావు..

రాజకీయ నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్లు 17 కంప్యూటర్ల లోని డేటా మొత్తాన్ని ధ్వం చేశామని చెప్పారు. అటు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను కూటా ట్యాప్ చేసినట్లు భుజంగరావు చెప్పారు. ఆ సమాచారాన్ని ప్రణీత్ రావుకు ఇస్తే, ఆయన బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేసేవారని ఒప్పుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News