BigTV English

Siddharth: అప్పుడు భయం లేదు అన్నాడు… మరి ఈ వాయిదా ఎందుకో?

Siddharth: అప్పుడు భయం లేదు అన్నాడు… మరి ఈ వాయిదా ఎందుకో?

Siddharth : యంగ్ హీరో సిద్ధార్థ్ (Siddharth)కు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రెండ్రోజుల క్రితం ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్ యూ’ (Miss You) మూవీ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్లో… పుష్ప 2 (Pushpa 2) సినిమా రిలీజ్ గురించి స్పందిస్తూ ‘అయితే ఏంటి? ఒకప్పటి రోజులు కావు ఇవి’ అంటూ సమాధానం చెప్పాడు. కానీ తాజాగా ఈ హీరో తన కొత్త సినిమాను వాయిదా వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.


చివరిసారిగా ‘చిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సిద్ధార్థ (Siddharth)… ఇప్పుడు ‘మిస్ యు’ అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 29న అంటే ఈ రోజున రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ‘మిస్ యూ’ మూవీ రిలీజ్ కి కరెక్ట్ గా వారం రోజుల్లో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప’ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మూవీని రిలీజ్ చేయడం అంటే రిస్క్ అని చెప్పాలి. అందుకే ఇప్పటిదాకా రిలీజ్ కూడా రెడీగా ఉన్న పలు పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కానీ సిద్ధార్థ్ మాత్రం ధైర్యంగా ఇలాంటి టైంలో ‘మిస్ యు’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు.

అందులో భాగంగానే సినిమాకు సంబంధించి జరిగిన రీసెంట్ ఈవెంట్లో ఈ విషయం గురించి ప్రస్తావన రాగా, ఆయన స్పందించిన తీరు చర్చకు దారి తీసింది. ఈ విషయం గురించి సిద్ధార్థ (Siddharth) మాట్లాడుతూ ‘సినిమా బాగుంటే థియేటర్లో నుంచి దాన్ని ఎవ్వరూ తీసే ఛాన్స్ లేదు. ఒకప్పుడు సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదు. కాబట్టి సినిమాల గురించి పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సినిమా బాగుంటే దాన్ని థియేటర్ల నుంచి ఎవ్వరూ తీయలేరు. కొంతమంది బడ్జెట్ ను బట్టి పెద్ద సినిమా లేదా చిన్న సినిమా అని నిర్ణయిస్తారు. కానీ నా దృష్టిలో మాత్రం సినిమా అంతా ఒకటే” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో సిద్ధార్థ్ కామెంట్స్ పై విమర్శలు వినిపించాయి.


ఇలాంటి కామెంట్స్ చేసినప్పటికీ, ప్రస్తుతం ‘మిస్ యు’ మూవీ గురించి ఎవ్వరూ పట్టించుకునే సిచువేషన్ కూడా లేదు. అందరూ ‘పుష్ప 2’ ఫీవర్ తోనే ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘మిస్ యు’ మూవీ పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ సిద్ధార్థ్ (Siddharth) నుంచి వచ్చిన ఈ ఊహించని పరిణామానికి మూవీ లవర్స్ షాక్ అవుతున్నారు. నిన్నటిదాకా పెద్ద పెద్ద కామెంట్స్ చేసి, ఇప్పుడేమో సైలెంట్ గా సైక్లోన్ కారణంగా అంటూ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని అంటున్నారు. మరి ఎవరికి భయపడి ఇప్పుడు సిద్ధార్థ ఈ మూవీని వాయిదా వేశాడు? పుష్ప రూల్ ముందు ఎవ్వరైనా తలవంచాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అల్లు అభిమానులు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×