Big Stories

Update on Kavitha’s Bail Petition: లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్స్ పై విచారణ వాయిదా..!

MLC Kavitha’s Bail Petition Postponed to May 2nd: లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇరువురి వాదలను విన్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, సీబీఐ కేసులో కూడా కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది.

- Advertisement -

లిక్కర్ పాలసీ కేసులో భాగంగా ఈడీ అరెస్ట్ లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో తన వాదనలు వినిపించారు. విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని కోర్టులో కవిత తరఫు న్యాయవాది వెల్లడించారు.

- Advertisement -

‘అరుణ్ రామచంద్రన్ పిళ్ళై 10 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ను ఈడీ అరెస్ట్ చెయ్యలేదు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. అనుమనితురాలిగా కూడా లేని కవితను నిందితురాలిగా మార్చారు. 5,6 గంటలు విచారణకు హాజరైన ఒక టెర్రరిస్టు, కరుడుగట్టిన నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేశారు. మార్చి 15న చట్టవిరుద్దంగా కవితను అరెస్ట్ చేశారు. కవిత- కేజ్రీవాల్ లను కలిపి విచారించడంలో ఈడీ విఫలం అయింది.

Also Read: Amitshah in Siddipet: ఇక బీజేపీ వంతు, వారానికి మూడు, సిద్ధిపేటకు 25న అమిత్ షా

విజయ్ నాయర్ సోషల్ మీడియా హ్యాండ్లర్, ఆయనతో సోషల్ మీడియా అంశం పైనే కవిత భేటి అయ్యింది. బుచ్చిబాబు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈడీ అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాక ఆయనకు బెయిల్ వచ్చింది. రాఘవ రెడ్డి బీజేపీ నుంచి పొత్తులో ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నాడు. బీజేపీకి ఎలాక్టోరల్ బాండ్లను శరత్ రెడ్డి కొనుగోలు చేసి అందించారు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశారు. కవిత ఆధారాలు ధ్వంసం చేశారు అంటున్నారు.. కానీ, ఆవిడ వాడిన ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చారు’ అని కవిత తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో తన వాదనలు వినిపించారు.

అయితే ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హోస్సేన్ కోర్టులో కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో భాగంగా ఈడీ కవితను ఫోన్లు అడిగిన తర్వాత ఆమె ఫోన్లను ఫార్మాట్ చేశారంటూ కోర్టు ముందు వెల్లడించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం మధ్యాహ్న 2 గంటలకు ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Also Read: Case on BJP Madhavi Latha: బీజేపీ అభ్యర్థి మాధవీపై కేసు, ఎందుకు?

ఇదిలా ఉండగా.. సీబీఐ కేసులో కూడా కవితకు మరో షాక్ తగిలింది. లిక్కర్ కేసులో భాగంగా సీబీఐ అరెస్ట్ లో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో భాగంగా ఇరువురి న్యాయవాదుల వాదనలు విన్న జడ్డి కావేరి బవేజ తీర్పును మే 2వ తేదీకి వాయిదా వేశారు.

కవిత తరఫున ఢిల్లీ కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది.. ‘మహిళగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడి కస్టడీలో ఉండగా, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది?.. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేనప్పటికీ అరెస్టు చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్. చిదంబరం కేసులో తీర్పు కవిత విషయంలో సరిపోతుంది. ఏడేళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదు. అరెస్టుకు సరైన కారణాలు లేవు’ అంటూ వాదించారు.

Also Read: Liquor shops closed Today: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు వైన్స్ బంద్!

సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. ‘కవితకు బెయిల్ ఇవ్వొద్దు. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారు. కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారు’ అంటూ కోర్టులో వెల్లడించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News