BigTV English

Suhas Prasanna Vadanam: మైత్రీ చేతికి ప్రసన్నవదనం.. మరో హిట్ కొట్టబోతున్నహీరో సుహాస్!

Suhas Prasanna Vadanam: మైత్రీ చేతికి ప్రసన్నవదనం.. మరో హిట్ కొట్టబోతున్నహీరో సుహాస్!

Suhas Prasanna Vadanam Movie Distribution Rights Goes to Mythri Movie Makers: టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్న హీరోల్లో సుహాస్ ఒకడు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కలర్ ఫోటో అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాకే జాతీయ అవార్డు వరించింది. ఇక ఈ సినిమా తరువాత హీరోగానే కాకుండా కమెడియన్ గా, విలన్ గా ఏ పాత్ర వచ్చినా న్యాయం చేస్తూ వచ్చాడు. ఆ తరువాత రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రసన్నవదనం. అరుణ్ VK దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సుహాస్ సరసన పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ పెంచేసింది. మే 3 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది.

Also Read: Vijay Devarakonda: బాడీగార్డ్ పెళ్ళిలో విజయ్ దేవరకొండ సందడి..


తమిళనాడు, తెలంగాణలో మైత్రినే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. సాధారణంగా మైత్రీ కథ నచ్చితేనే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తుంది. ప్రసన్నవదనంతో సుహాస్ మైత్రీని పడేసినట్లు తెలుస్తోంది. ఇది సుహాస్ కు ఒక బంఫర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అతని మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×