E-Paper
Advertisement

ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
Advertisement

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర విషాదాన్ని నింపింది. తమ డిమాండ్ల సాధన కోసం సాగుతున్న పోరాటంలో భాగంగా ఆత్మహత్యకు పాల్ప‌డ్డ‌ నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ మృతి చెందారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నెరవేరడం లేదన్న ఆవేదనతో, గురువారం మధ్యాహ్నం నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ క్రమంలో ఆయన శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది.

ఘటనా స్థలంలో ఉన్న వారు వెంటనే స్పందించి ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే శంకర్ గౌడ్ కన్నుమూశారు. కర్మాన్‌ఘాట్ సమీపంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

శంకర్ గౌడ్ మరణవార్త తెలియడంతో ఆర్టీసీ కార్మికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలోనే, శంకర్ గౌడ్ బలవన్మరణం చెందడం కార్మిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని, విషాదాన్ని నింపింది. నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోయామని తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Read Also: ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

Advertisement

 

Related News

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!

Big Stories

Advertisement
×