Sabarimala Special Trains : ప్రతీ ఏటా సంక్రాంతికి లక్షల మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకొని మొక్కు తీర్చుకోవడానికి కేరళలోని శబరిమలై వెళ్తుంటారు. అక్కడ అయ్యప్ప స్వామిని, జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని తిరిగి బయల్దేరతారు. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల దక్షిణ రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా 26 ట్రైన్ సర్వీసులను ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి కేరళలోని కొల్లం, కొట్టాయంకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. వాటి వివరాలు
సికింద్రబాద్ – కొల్లం (నం 07117) : తేదీలు నవంబరు 20, డిసెంబరు 4, 18, జనవరి 8
కొల్లం-సికింద్రాబాద్ (నం 07118) : నవంబరు 22, డిసెంబరు 6, 20 జనవరి 10
సికింద్రాబాద్-కొల్లం (నం07121): నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15
కొల్లం-సికింద్రాబాద్ (నం07122): నవంబరు 29, డిసెంబరు 13, 27, జనవరి 3, 17
సికింద్రాబాద్-కొల్లం (నం07123): నవంబరు 21, 28 తేదీల్లో రెండు సర్వీసులు
కొల్లం-సికింద్రాబాద్ (నం07124):నవంబరు 23, 30
సికింద్రాబాద్-కొట్టాయం (నం07125): నవంబరు 20, 27
సికింద్రాబాద్-కొట్టాయం (నం07125): నవంబరు 21, 28
దక్షిణ మధ్య రైల్వేలో శబరిమల ప్రత్యేక రైళ్ల పూర్తి టైమింగ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ అధికారిక వెబ్సైట్ https://scr.indianrailways.gov.in/ ను విజిట్ అవ్వండి.