Sandhya Theater Mangement: మాకు అన్నీ అనుమతులు ఉన్నాయి. 45 ఏళ్లుగా థియేటర్ విజయవంతంగా నడుపుతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. హీరో అల్లు అర్జున్ ఒక్కడే కాదు, గతంలో ఎందరో హీరోలు సినిమా విడుదల సమయంలో తమ థియేటర్ కు వచ్చారని సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే రేవతి కుమారుడు తొక్కిసలాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రస్తుతం కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ బాలుడు కోరుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో, తొక్కిసలాట జరిగిందన్న కారణంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ పై సైతం కేసు నమోదు కాగా, న్యాయస్థానం బన్నీకి బెయిల్ మంజూరు చేసింది.
అయితే పోలీసులు మాత్రం చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్న రీతిలో దర్యాప్తును సాగిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కేసు నమోదు చేయగా, తాజాగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానమిచ్చింది. తమ న్యాయవాదుల ద్వారా ఆరు పేజీల లేఖను పోలీసులకు యాజమాన్యం పంపినట్లు తెలుస్తోంది.
నోటీసులకు సంధ్య థియేటర్ ఇచ్చిన రిప్లై ఇచ్చిన వివరాల మేరకు.. తమ థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 45 ఏళ్లుగా విజయవంతంగా థియేటర్ నడుపుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గతంలో ఎన్నడు ఇలాంటి దుర్ఘటనలు జరగలేదని, పుష్ప టు ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు ఆ లేఖలో యాజమాన్యం తెలిపింది. డిసెంబర్ 4, 5 తేదీలలో తమ థియేటర్ ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందని తెలపడం విశేషం. గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు తమ థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చారని కూడా యాజమాన్యం తెలిపింది. సంధ్యా థియేటర్లో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ కి ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా ఉందని వారు తెలిపారు.
Also Read: Teaching Jobs: గుడ్ న్యూస్.. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ఉద్యోగాలు..
కాగా సంధ్యా థియేటర్ యాజమాన్యం న్యాయవాదుల ద్వారా పంపించిన 6 పేజీల లేఖను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోమారు నోటీసులు జారీ చేస్తారా, లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ సైతం మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తప్పిసలాట కేసు దర్యాప్తు సాగుతుందని, మనీ బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.