Caller Tune Voice: సాధారణంగా సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తరువాత ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది అమాయకులను ఈ సైబర్ నేరగాళ్లు మాయ చేసి, మాటలు చెప్పి ఈ ఫోన్ కాల్స్ ద్వారా టార్గెట్ చేస్తూ వారిని సర్వం దోచేస్తున్నారు. వారి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. లక్కీ డ్రా అని, ఆఫర్స్ వచ్చాయి అని ,బ్యాంకు లోన్స్ అని ఏవేవో చెప్పి.. అమాయకపు ప్రజలను నమ్మించి, డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఇలాంటి సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి అని, ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా అవేర్నెస్ అంటూ ఒక వాయిస్ కాల్ ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫోన్లో ప్రజలకు జాగ్రత్త చెబుతూ అవగాహన కల్పిస్తూ.. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.
ఇన్నాళ్లు ఫోన్లో విసిగించిన అమ్మాయి ఈమె..
అంతేకాదు ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా. ” సోషల్ మీడియా లేదా తెలియని గ్రూపుల నుండి పెట్టుబడి చిట్కాలు” అంటూ ఒక లేడీ వాయిస్ మనకు వినిపిస్తుంది. ఈ వాయిస్ మనకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ప్రతిసారి ఫోన్ చేయగానే ఇదే వాయిస్ వినిపించడంతో చాలామంది తిట్టుకునే వారు కూడా లేకపోలేదు.అయితే ఆ వాయిస్ ఎవరిదో ఎట్టకేలకు తెలిసిపోయింది. ఆమె వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. కానీ పదే పదే వినడం వల్ల అందరికీ విసుగు వస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రతిరోజు మనకు అవగాహన కల్పిస్తూ వినిపించే వాయిస్ ఈ అమ్మాయిదే. ఈమె పేరు అమృత (Amrita). రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తుంది. ప్రతిరోజు తన వాయిస్ తో ఎంతోమందిని అలరిస్తూ ఉండే అమృత .. ఇప్పుడు ప్రతిరోజు మన ఫోన్లో కూడా తన వాయిస్ ను వినిపిస్తోంది..
నా చేతుల్లో ఏమీ లేదంటూ వీడియో షేర్ చేసిన అమృత..
అయితే ఇప్పుడు తన వాయిస్ తో పాటు తనను కూడా అందరికీ పరిచయం చేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది. “సోషల్ మీడియా లేదా తెలియని గ్రూపుల నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే ప్లాన్స్ కావచ్చు”.. ఫ్రెండ్స్.. నా వాయిస్ కు నేనే ఇరిటేట్ అవుతున్నాను. మొన్నటి వరకు మా అమ్మానాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని సంబరపడ్డారు.. కానీ ఇప్పుడు ఏంటి ఈ గోల మాకు అంటున్నారు. కానీ ఏం చేస్తాం. నా చేతిలో ఏం లేదు కదా ” అంటూ ఒక ఫన్నీ వీడియోని కూడా షేర్ చేసింది అమృత. ప్రస్తుతం అమృత షేర్ చేసిన వీడియో వైరల్ గా మారగా.. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని విసిగిస్తున్నది నువ్వే నా తల్లీ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. ఇన్ని రోజులూ.. ముఖం కనిపించకుండా గొంతు మాత్రమే వినిపిస్తూ అందరికీ ఇరిటేట్ తెప్పించిన అమృత చూడడానికి హీరోయిన్ రేంజ్ లో ఉందని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/Addictedtomemez/status/1893953621609640023
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">