Dasara Holidays: విద్యార్థులకు సెలవుల సీజన్ మొదలైంది. వినాయక చవితితో మొదలైన సెలవు సందడి కంటిన్యూ అవుతోంది. వచ్చేవారం నుంచి దసరా సెలవులు మొదలుకానున్నాయి. అందుకోసం విద్యార్థులు అప్పుడే రకరకాల ప్లాన్లు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇప్పటి నుంచి ఎప్పుడు వరకు ఇస్తున్నారనేది చూద్దాం.
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు వచ్చేవారం నుంచి మొదలుకానున్నాయి. ఈసారి సెలవులు 13 రోజులు వచ్చాయి. అక్టోబరు 10 నుంచి 22 వరకు ఉండనున్నాయి. అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు ఉంటాయని వెల్లడించారు విద్యాశాఖ అధికారులు. దసరా సెలవులకు ముందు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 1న ప్రారంభమై 9తో ముగియనున్నాయి. అక్టోబరు 10 రెండో శనివారం శనివారం కావడంతో ఆనాటి నుంచి దసరా సెలవులు కంటిన్యూ కానున్నాయి.
దసరా సెలవుల నేపథ్యంలో పాఠశాలల్లో నిర్వహించాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ విద్యా పరిశోధన-శిక్షణ మండలి ప్రకటించింది. అక్టోబరు 1వ నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు మొదలుకానున్నాయి. అక్టోబరు 9 నాటికి పరీక్షలు పూర్తి అయ్యేలా షెడ్యూల్ రెడీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అక్టోబరు 10 నుంచి విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అక్టోబరు 22 వరకు సెలవులు దసరా సెలవులు ఉంటాయి. 23 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
సెలవులు ముందుగా ప్రకటించడంతో విద్యార్థులు-తల్లిదండ్రులు తమ ప్రయాణాలు, పండుగ కార్యక్రమాలను ముందుగా ప్రణాళిక చేసుకునే అవకాశం లభించింది. స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాలు పరీక్షలు కాగానే ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దసరా సెలవులు ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ పాఠశాలలు విద్యా క్యాలెండర్ ఫాలో కావాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు దసరా సెలవుల సందడి అప్పుడే మొదలైంది. అక్టోబర్ 11 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలుకానున్నాయి. 19న సద్దుల బతుకమ్మ కాగా, 20న విజయదశమి రానుంది. అక్టోబర్ 22 తో దసరా సెలవులు ముగియనున్నాయి.
ALSO READ: అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్!