E-Paper
Advertisement

అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్!

అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్!
Advertisement

Alwal Murder: సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరడంతో ఓ భార్య కట్టుకున్న భర్తపై గొడ్డలితో విరుచుకుపడి ప్రాణాలు తీసింది. మచ్చ బొల్లారం గోపాల్‌నగర్‌లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో ఈ దారుణం జరిగింది.

మాటామాటా పెరిగి… దారుణం జరిగింది!

Advertisement

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్, రమాదేవి దంపతులు పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. శ్రీనివాస్ ఇటీవల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా తీవ్ర నష్టాలు వచ్చాయి. దీనితో ఇంట్లో రోజురోజుకూ ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఈ విషయమై కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

వ్యాపార నష్టాలు.. గొడ్డలితో దాడి

Advertisement

ఆదివారం రాత్రి కూడా వ్యాపార నష్టాల ప్రస్తావన రావడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మాటమాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన రమాదేవి, ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ ఘటనా స్థలంలోనే రక్తమడుగులో ప్రాణాలు వదిలాడు.

రంగంలోకి పోలీసులు..

ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్య వెనుక కేవలం వ్యాపార నష్టాలే కారణమా లేక వేరేమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: డిండి నీళ్లపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని..

Tags

Related News

వచ్చేవారం నుంచి దసరా సెలవులు.. ఈసారి రెండువారాలు, విద్యార్థుల్లో ఒకటే సందడి

డిండి నీళ్లపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని..

హైదరాబాద్ సిటీలో చెడ్డీ గ్యాంగ్ దూకుడు.. పలు ఏరియాల్లో ఎంటర్, అలర్టయిన పోలీసులు

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

Big Stories

Advertisement
×