E-Paper
Advertisement

ఫ్యామిలీ మొత్తం కలిసి మర్డర్ ప్లాన్.. సికింద్రాబాద్ యావన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు చెప్పిన డీసీపీ

ఫ్యామిలీ మొత్తం కలిసి మర్డర్ ప్లాన్.. సికింద్రాబాద్ యావన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు చెప్పిన డీసీపీ
Advertisement

Yavan murder case: సికింద్రాబాద్‌ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం జరిగిన బీటెక్ విద్యార్థి యావన్ (23) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన యువతి బావ.. సోదరుడితో పాటు మొత్తం పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్ సీతాఫల్‌మండిలో ఒక యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని యువతి బంధువులే పథకం ప్రకారం అతడిని అంతం చేసినట్లు విచారణలో తేలింది. సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ‘ప్రీ ప్లాన్డ్ మర్డర్’.

జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్, చంద్రికలు పాఠశాల స్థాయి నుండి స్నేహితులు. గత రెండేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలోనే యావన్‌ను పలుమార్లు హెచ్చరించారు. మరోవైపు యువతి బావ, చిలకలగూడ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ అయిన అల్లబోయిన సాయి కిరణ్ ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న యావన్‌ను తొలగించుకోవాలని సాయి కిరణ్ ఐదు రోజుల ముందే హత్యకు స్కెచ్ వేశాడు.

Advertisement

మే 7 అర్ధరాత్రి సమయంలో నిందితులు మూడు ద్విచక్ర వాహనాలపై యావన్ ఉంటున్న సీతాఫల్‌మండిలోని అతని స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. నిందితులు ఒక్కసారిగా లోపలికి చొరబడి కత్తులతో దాడి చేయగా.. ప్రాణభయంతో యావన్ బయటకు పరిగెత్తాడు. అయినా వదలకుండా నడిరోడ్డుపై వెంబడించి అత్యంత క్రూరంగా 17 చోట్ల కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో ఇద్దరు నిందితులు (శ్రీగిరి రాహుల్, శివ నందన్ యాదవ్) గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

ఘటనపై ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రధాన నిందితుడు సాయి కిరణ్ (A1), యువతి తండ్రి నర్సింహ యాదవ్, బాబాయ్‌లు, సోదరుడు సహా పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి హత్యకు వాడిన కత్తి, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ కార్పొరేటర్ సామల హేమ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులకు ఉరిశిక్ష వేయాలని కోరుతోంది.

Advertisement

Read Also: నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×