BigTV English

Byri naresh : ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు.. బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..

Byri naresh : ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు.. బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..

Byri naresh : అయ్యప్పస్వామిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగానే చేసినట్లు అంగీకరించాడు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడని రిమాండ్‌ రిపోర్ట్‌ ద్వారా స్పష్టమైంది.


బైరి నరేష్.. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయగానే హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆందోళన చేపట్టారు. అతడిపై వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌లో ఉన్న భైరి నరేష్‌ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. కావాలనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. అలాగే.. నరేష్‌ను తనను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, ఆ రోజు సభను నిర్వహించిన హనుమంతు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

మరోవైపు భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్‌ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ కాపీలో ఉంది. మత విద్వేషాలకు పాల్పడాలన్న ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కొడంగల్‌ స్థానిక కోర్టుకు తెలిపారు. హన్మకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్‌ స్టేషన్‌లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


కొద్దిరోజుల క్రితం కొడంగల్‌లోని అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భైరి నరేష్‌ పాల్గొన్నాడు. ఈ సమయంలోనే హిందూ దేవుళ్లు, అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఉమాపతి గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఆ తర్వాత బైరి నరేష్ ను అరెస్ట్ చేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×